breaking news
columbo
-
దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం
కొలంబో: దిత్వా తుపాను బీభత్సం ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.దిత్వా తుపాను ప్రభావం శ్రీలంకపై కొనసాగుతోంది. తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా.. 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు. డీఎంసీ ప్రకారం ఈ తుపాను.. దేశవ్యాప్తంగా 3,09,607 కుటుంబాలను ప్రభావితం చేసింది. ఇక, ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఈ తుపాను నిలిచింది. వరదల కారణంగా పలు పట్టణాలు మునిగిపోయాయని, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయని, మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.🚨🇱🇰 CYCLONE DITWAH just tore through Sri Lanka. Death toll hits 153, half a million flooded, 191 missing, entire tea estates buried, suburbs turned into death traps. 44,000 crammed in shelters, 15,000 homes gone, 1.75 million without power. The Air Force rescued 121 in 50mph… pic.twitter.com/fsLDducOss— TheCommonVoice (@MaxRumbleX) November 30, 2025మరోవైపు.. దిత్వా నేపథ్యంలో ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో శ్రీలంకలో భారత్ చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, రెండు చేతక్ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని శ్రీలంకకు పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. అంతకు ముందురోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్ 76 విమానాలు 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.Cyclone ‘Ditwah’ Batters Sri Lanka; Government Appeals for International Aid pic.twitter.com/oGwmHUb5gA— Indian News Network (@INNChannelNews) November 29, 2025కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను ఆదివారం రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. 247 మంది తిరువనంతపురానికి, 76 మంది దిల్లీకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో 45 మందిని భారత వాయుసేన (ఐఏఎఫ్) హెలికాప్టర్లు కొలంబోకు తరలించాయి. ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్ తరలించింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులెవరైనా అత్యవసర హెల్ప్‌డెస్క్‌ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. -
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్ (44 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), ఫించ్ (40 బంతుల్లో 61 నాటౌట్; 4ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తొలుత లంక జట్టు 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), గుణతిలక (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అసలంక (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఇంకెవరూ ఆసీస్ పేస్ ముందు నిలబడలేకపోయారు. హాజల్‌వుడ్ (4/16), స్టార్క్ (3/26) నిప్పులు చెరిగారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి నెగ్గింది. ఇదే వేదికపై నేడు రెండో టి20 జరుగుతుంది. -
చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని!
కొలంబో: తీవ్ర సంక్షోభం దరిమిలా శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే దాదాపు చేతులెత్తేశారు. ఇప్పటికే దివాలా తీసిన దేశంలో రాబోయే రోజుల్లో.. మరిన్ని కష్టాలు తప్పవని లంక పౌరులకు ముందస్తు సంకేతాలు పంపించారు. ‘‘వాస్తవాల్ని దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదు. అబద్ధాలతో లంక ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి అంతకన్నా లేదు’’ అంటూ ఆయన సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘పెట్రో నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్కరోజుకు సరిపడా మాత్రమే నిల్వ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. దిగుమతులు చేసుకునేందుకు సైతం డాలర్లు కొరత నెలకొందని సంక్షోభ తాలుకా తీవ్రతను ప్రజలను వివరించే ప్రయత్నం చేశారు. కొలంబో హార్బర్ బయట మూడు షిప్పుల్లో ఆయిల్ ఎదురు చూస్తోంది. కానీ, డాలర్లు చెల్లించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేకుండా పోయింది. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. డబ్బు ముద్రించడమే ఇక మనకు ఉన్న ఆఖరి వనరు అని సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తీవ్ర సంక్షోభంతో 22 మిలియన్ల మంది అష్టకష్టాలు పడుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పోయిన గురువారం ఆయన ప్రధాని పదవి చేపట్టారు. ఫ్యూయల్, విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని, నష్టాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పుకొచ్చారు. చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
శ్రీలంకలో ఇంకా బాంబుల మోత
కొలంబో: శ్రీలంకలో ఇంకా బాంబుల మోత మోగుతోంది. ఈస్టర్ సండే రోజు జరిగిన మారణహోమం నుంచి తేరుకోకముందే.. శుక్రవారం రాత్రి మరోసారి మానవ బాంబులు పేలాయి. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కాల్పులకు పాల్పడగా.. ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా సమ్మంతురై ప్రాంతంలో ఉగ్రస్థావరంపై సైన్యం దాడులు నిర్వహించింది. భద్రతాబలగాల రాకను పసిగట్టిన దుండగులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతిచెందారు. ఈ స్థావరం నుంచి భద్రతాబలగాలు భారీగా పేలుడు పదార్థాలు, ఐసిస్ యూనిఫారాలను స్వాధీనం చేసుకున్నాయి. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో 253 మంది మరణించారు. 500మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఈ దాడులకు ఐసిస్ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించుకుంది. -
కిడ్నీ రాకెట్లో దిమ్మతిరిగే వాస్తవాలు
-కొలంబోలోని మూడు ఆస్పత్రుల్లో నెట్వర్క్ -ఒక్కో కిడ్నీకి రూ.25 లక్షలు - ఖర్చు పోనూ దాతకు ఇచ్చేది రూ. 5లక్షలు - రాకెట్ ఏజెంట్‌తో సహా ముగ్గురు బాధితుల అరెస్టు - కారు, ఏటీఎం కార్డు, పాస్‌పోర్టుల స్వాధీనం - సాక్షి కథనాలతో వెలుగులోకి.. నల్లగొండ: నల్లగొండ జిల్లా కిడ్నీ రాకెట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటర్ నెట్ ద్వారా అమాయకులకు ఎరవేసి జాతీయస్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, బెంగాల్లో నలుగురు, హైదరాబాద్‌లో నలుగురు, తమిళనాడులో ఇద్దరు, ముంబైలో ఒక్కరు, న్యూఢిల్లీలో ఒక్కరు చొప్పున కిడ్నీలను అమ్మించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని ఏజెంటు కస్పరాజు సురేష్ (22) తన కిడ్నీని అమ్ముకుని ఏజెంటుగా మారి 15 మంది కిడ్నీలను వివిధ ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలిపారు. అయితే అవసరమున్న వారు ఒక్కో కిడ్నీకి రూ. 25 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. దాంట్లో కిడ్నీ దాతకు అన్ని ఖర్చులు పోను రూ. 5లక్షలు చెల్లిస్తారని వివరించారు. ఈ రాకెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక, న్యూఢిల్లీ, బెంగాల్, ముంబై, కొలంబో ప్రాంతాలకు సంబంధాలున్నాయని వివరించారు. అమయాకులను ఎరవేసి విజిటింగ్ విసా పేరిట కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్‌తో పాటు జిల్లా కేంద్రానికికే చెందిన మరో ముగ్గురు ఎం.డీ. అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద 3 పాస్‌పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


