ఐరాస దళాలకు తొలిసారి మహిళ నేతృత్వం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా నార్వేకు చెందిన మేజర్ జనరల్ క్రిస్టీన్ లండ్ (55) రికార్డు సృష్టించారు. సైప్రస్‌లో దాదాపు 1,000 మందితో కూడిన దళానికి ఆమె సారథ్యం వహించనున్నట్టు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ సోమవారం వెల్లడించారు. క్రిస్టీన్ నియామకానికి ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పచ్చజెండా ఊపారన్నారు.