breaking news
Children aged under five years
-
8, 29లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల: వయో వృద్ధులు, దివ్యాంగులు, అయిదేళ్ల లోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎక్కువమందికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సామాన్య రోజులను కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో 65 సంవత్సరాలు పైబడినవారు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు రోజూ ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు మరింతమందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టీటీడీ అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. అయిదేళ్ల లోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10,30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సంవత్సరం లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. -
పల్స్ పోలియో.. 93.6 శాతం
సాక్షి, సిటీబ్యూరో: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారులు 10 లక్షల మంది ఉన్నారు. తొలిరోజు 93.6 శాతం అంటే 9,27,019 మందికి చుక్కలు వేశారు. సీఎం కేసీఆర్ ఉదయం ఏడు గంటలకు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య జవహర్‌నగర్‌లో, మంత్రి తలసాని అమీర్‌పేటలో చుక్కల మందు వేశారు. తొలిరోజు వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లోనూ వేయనున్నారు.