breaking news
capital villages
-
వైఎస్ జగన్కు ఎదురైన ప్రజాభిమానం
-
రాజధాని గ్రామాల్లో సీపీఐ యాత్ర
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు, వృద్ధులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 11 న సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. -
'రైతులూ.. ఆందోళన చెందవద్దు..'
విజయవాడ: నూతన రాజధాని ప్రాంతంలోని రైతులు గ్రామకంఠాలపై ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భూసేకరణ జరిగే గ్రామాలను మరోసారి పరిశీలించి వాటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో శనివారం జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీలు, కేంద్రకమిటీలపై చర్చిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రానున్న ఐదేళ్లలో ఖర్చు చేయాల్సిన రూ.65వేల కోట్లపై సమీక్షిస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు. -
సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..
* గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాలు.. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం విడిగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలో చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉండేవి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటికంటే ఇప్పుడు మరిన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. (పాత జాతీయ రహదారి నుంచి ప్రకాశం బ్యారేజీ టు మంగళగిరి వై-జంక్షన్ వరకూ ఉన్న గుంటూరు రెవెన్యూ గ్రామాలు) తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్. మంగళగిరి మండలం: కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, నౌలూరు, దాని పరిధిలోని హామ్లెట్స్, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు: తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాం తం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. భట్టిప్రోలు మండలం: శివంగులపాలెం, భట్టిప్రోలు (గ్రామ నెం.16 అద్దేపల్లి), వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి. హాపొన్నూరు మండలం: మునిపల్లె, మామిళ్లపల్లె, తొండమూడి, ఉప్పరపాలెం, చింతలపూడి, వెల్లలూరు, ఆరమండ, దండమూడి, పచ్చల తాడిపర్రు, మన్నవ, దొప్పలపూడి, జడవల్లి, నిడుబ్రోలు, జూపూడి, బ్రాహ్మణ కోడూరు, వడ్డిముక్కల గ్రామాలున్నాయి. ప్రత్తిపాడు మండలం: కొండపాడు, యనమదల, ఏదులపాలెం, నడింపాలెం, ప్రత్తిపాడు, మల్లయ్యపాలెం, గొట్టిపాడు, కొండజాగర్లమూడి, గణికెపూడి గ్రామాలున్నాయి. పెదనందిపాడు మండలం: గొరిజెవోలు, గుంటెపాలెం గ్రామాలున్నాయి. యడ్లపాడు మండలం: మర్రిపాలెం, ఉన్నవ, కొండవీడు, సొలస, వంకాయలపాడు, మైదవోలు, యడ్లపాడు, విశ్వనాథుని కండ్రిగ, జాలాది, తిమ్మాపురం, కరుచోల గ్రామాలు. నాదెండ్ల మండలం: నాదెండ్ల గ్రామం ఉంది. ఫిరంగిపురం మండలం: హవుసు, గణేశ, రేపూడి, ఫిరంగిపురం, అమీనాబాద్, నుదురుపాడు, వేమవరం, బేతపూడి, తల్లూరు, యర్రగుంట్లపాడు, సిరంగిపాలెం, తక్కెళ్లపాడు గ్రామాలున్నాయి. ముప్పాళ్ల మండలం: మాదాల గ్రామం. సత్తెనపల్లి మండలం: పెదమక్కెన, కొమెరపూడి, లక్కరాజు, గార్లపాడు, నందిగామ, కంటిపూడి, భీమవరం, కంకణాలపల్లి, గుడిపూడి, పణిదెం, అబ్బూరు, పాకాలపాడు, రెంటపాళ్ల, గోరంట్ల, కట్టమూరు, భట్లూరు, వడ్డవల్లి గ్రామాలున్నాయి. పెదకూరపాడు మండలం: మొత్తం మండల ప్రాంతమంతా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. అచ్చంపేట మండలం: కష్టాల అగ్రహారం, కోనూరు, ఓర్వకల్లు, అంబడిపూడి, వేల్పూరు, చిగురుపాడు, మిట్టపాలెం, పెదపాలెం, చామర్రు (అచ్చంపేట, నీలేశ్వరపాలెం పంచాయితీలు కలుపుకుని), తాళ్లచెర్వు, చింతపల్లె, కోగంటివారి పాలెం గ్రామాలున్నాయి. కోసూరు మండలం: అనంతవరం, అగ్రహా రం, క్రోసూరు, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం, పారుపల్లి, పీసపాడు, అందుకూరు, బాలెమర్రు, ఉయ్యందన గ్రామాలున్నాయి. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి. నందిగామ మండల పరిధిలో: కంచర్ల, ఐతవరం, సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, అడవిరావులపాడు, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి. చందర్లపాడు మండలం: చింతలపాడు, విభరీతపాడు, ఏటూరు, కోనాయపాలెం, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, బొబ్బెళ్లపాడు, మునగాలపల్లె, ముప్పా ల, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, చందర్లపాడు, ఉస్తెపల్లె, కాసరబాద, పొక్కునూరు, కొడవటికల్లు, పున్నవల్లె, వేలాడి, పొప్పూరు గ్రామాలున్నాయి. మైలవరం మండలం: తొలుకోడు, కీర్తిరాయణగూడెం, వెదురుబీడెం, కనిమెర్ల, పర్వతపురం, తుమ్మలగుంట, గన్నవరం, చంద్రాల, మైలవరం, వెల్వదం, గణపవరం, పొందుగుల, జనగాలపల్లె, చంద్రగూడెం, సబ్జపాడు గ్రామాలున్నాయి. అగిరిపల్లె మండలం: మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. బాపులపాడు మండలం: మల్లవల్లి, రేమల్లె, సింగన్నగూడెం, వెలేరు, బాపులపాడు, సెరి నరసన్నపాలెం, రంగన్నగూడెం, శోభనాద్రిపురం, కొదురుపాడు, బండారుగూడెం, అంపాపురం, వీరవల్లె, వెంకటరాజుగూడెం, తిప్పనగుంట, కొనుమోలు, ఆరుగొలను, వెంకటాపురం, చిరివాడ, కొయ్యూరు, బొమ్ములూరు, బొమ్ములూరు కండ్రిగ, దంతగుంట్ల, కాకులపాడు, రామన్నగూడెం, ఓగిరాల, కురిపిరాల గ్రామాలున్నాయి. నూజివీడు మండలం: హనుమంతుని గూ డెం, వెంకాయపాలెం, అన్నవరం, ముక్కొల్లుపాడు, నూజివీడు, సంకొల్లు, ఎనమడాల, బాతులవారిగూడెం, రావిచెర్ల, బూరవంచ, రామన్నగూడెం, మొర్సపూడి, దేవరగుంట, జంగంగూడెం, తుక్కులూరు, వేంపాడు, గొల్లపల్లె, పొలసనపల్లె, మీర్జాపురం, పోతురెడ్డిపల్లె, పల్లెర్లమూడి, మోక్షనరసన్న పాలెం, సీతారాంపురం, మర్రిబందం గ్రామాలున్నాయి. పమిడిముక్కల మండలం: మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా. మొవ్వ మండలం: పెదశనగలూరు, భాట్ల పెనుమర్రు, అయ్యంకి, పెదపూడి, యద్దనపూడి, కూచిపూడి, బార్లపూడి, మొవ్వ, గుడపాడు, వేములమాడ గ్రామాలున్నాయి. చల్లపల్లి మండలం: చల్లపల్లి, వెలివోలు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, పురిటిగడ్డ, లక్ష్మీపురం, చిడెపూడి, నడకుదురు, పాగోలు గ్రామాలున్నాయి. ఘంటశాల మండలం: శ్రీకాకుళం, తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకల్లెపల్లె, వేములపల్లె, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం గ్రామాలున్నాయి. పామర్రు మండలం: రాపర్ల, పామర్రు, పసుమర్రు, రెమ్మనపూడి, కొండిపర్రు, ఐనంపూడి, బల్లిపర్రు, జెమి గొల్వెపల్లి, కొమరవోలు, పెదమద్దాలి, అడ్డాడ, కురుమద్దాలి, కనుమూరు, ఉరుటూరు, జుజ్జవరం, జామిదగ్గుమల్లి. పెదపారుపూడి మండలం: మండలం మొత్తం ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతం. గుడివాడ మండలం: గుడివాడ రూరల్, చౌటుపల్లి, చిన ఎరుకపాడు, బొమ్ములూరు, గంగాధరపురం, పెద ఎరుకపాడు, మందపాడు, బల్లిపాడు, బేతవోలు, నాగవరప్పాడు, వలివర్తిపాడు, చిలకంపూడి, దొండపాడు, లింగవరం, మెరకగూడెం, సీపూడి, తాటివర్రు, అల్లిదొడ్డి, రమణపూడి, చిరిచింతల, సేరిదింటకొర్రు, సిద్దాంతం, సేరివేల్పూరు గ్రామాలు. గుడ్లవల్లేరు మండలం: సేరికాల్వపూడి, పెంజెండ్ర, చిత్రం, అంగలూరు, గుడ్లవల్లేరు, వేముగుంట గ్రామాలున్నాయి. నందివాడ మండలం: చేదుర్తిపాడు, జనార్ధనపురం, నూతులపాడు, శ్రీనివాసపురం, నందివాడ, పుట్టగుంట, వొద్దులమెరక, చినలింగాల, పెదలింగాల, అరిపిరాల, రామాపురం, తుమ్మలపల్లె గ్రామాలున్నాయి. తోట్లవల్లూరు మండలం: మొత్తం మండలంతో పాటు పట్టణ ప్రాంతం కూడా. మోపిదేవి మండలం: కప్తనపాలెం, కోకిలగడ్డ, బొబ్బర్లంక, మోపిదేవి, మోపిదేవిలంక, నాగాయతిప్ప, అన్నవరం, వెంకటాపురం, పెదప్రోలు గ్రామాలున్నాయి. -
రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తల తరలింపు!
-
రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తల తరలింపు!
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేందుకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి రైతులు మంగళవారం ఆరు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. అయితే రైతుల ముసుగులో టీడీపీ నాయకులు... పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నట్లు సమాచారం. తాను భూములివ్వడానికి సిద్ధంగా లేనంటూ మీడియాతో మాట్లాడిన నరేష్ అనే రైతును ...టీడీపీ నేతలు బలవంతంగా బస్సులో నుంచి దింపేశారు. అంతా అనుకూలంగా ఉన్నామని చెప్పేవాళ్లే సీఎంను కలవాలని తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణపై ఒప్పించడానికి 29 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమావేశం కానున్న విషయం తెలిసిందే. రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల రైతులతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ కానున్నారు. -
రాజధాని ప్రాంతంలో భూముల పరిరక్షణ కమిటీ పర్యటన
హైదరాబాద్: ఏపి రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో వైఎస్ఆర్ సిపి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన భూముల పరిరక్షణ కమిటీ పర్యటిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని భూముల వ్యవహారంపై పరిరక్షణ కమిటీ చర్చించినట్లు తెలిపారు. కమిటీ రాజధాని భూసేకరణ గ్రామాలలో పర్యటిస్తుందని చెప్పారు. రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. అభిప్రాయ సేకరణ తరువాత కమిటీ మళ్లీ సమావేశమవుతుందని చెప్పారు. భూసేకరణపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడమే మొదటి పనని అన్నారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు, ప్రజలు, కూలీల హక్కులు కాపాడాలన్నదే తమ ధ్యేయం అన్నారు. కమిటీలోకి అదనంగా మరో నలుగురిని తీసుకున్నట్లు అంబటి చెప్పారు. **