breaking news
business agreements
-
భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం
వాషింగ్టన్: భారత్‌తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చాలారోజులుగా కొనసాగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో గొప్ప ఒప్పందాలు పట్టాలెక్కబోతున్నాయని, వాటిలో ఒక ఒప్పందం బహుశా ఇండియాతోనే కావొచ్చని పేర్కొన్నారు. అది భారీగానే ఉంటుందని ఉద్ఘాటించారు. వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియాతో కలిసి పని చేయబోతున్నామని వివరించారు. ప్రతి దేశంతోనూ తమకు చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రతి దేశం ఆసక్తి చూపుతోందని అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొనే పనిలో తమ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరితో ఒప్పందాలకు రావాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బృందం గురువారం వాషింగ్టన్కు చేరుకుంది. మధ్యంతర ట్రేడ్ డీల్‌ను వచ్చే నెల 9వ తేదీ కల్లా ఖరారు చేసుకొనేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. ఇండియా ఉత్పత్తులపై ఏప్రిల్ 2న విధించిన అధిక టారిఫ్‌లను జూలై 9 దాకా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. గడువులోగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపై సుంకాలను చాలావరకు మినహాయించాలని అమెరికా కోరుతుండడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మద్యం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, కొన్ని రకాల పండ్లు, జన్యుమారి్పడి పంటలపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వ్రస్తాలు, వజ్రాలు, బంగారు అభరణాలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, ఆరటి పండ్లపై సుంకాల్లో కోత విధించాలని అమెరికాను భారత్ కోరుతోంది. వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాల డిమాండ్లకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని ఏకంగా 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి. #WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44— ANI (@ANI) June 26, 2025చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం చేయలేదు. రెండు రోజుల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా స్పష్టంచేశారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన మాట నిజమేనని చైనా వాణిజ్య శాఖ సైతం ధ్రువీకరించింది. చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికా కంపెనీలు సులభంగా పొందడానికి వీలుగా ఒప్పందానికి రాబోతున్నట్లు రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారా? లేదా? అనేది బయటపెట్టలేదు. అమెరికా కాలేజీల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేసే ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్‌కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
'మీది ప్రపంచ కర్మాగారమైతే.. మాది వనరుల క్షేత్రం'
వ్యాపారం చేయడంతోపాటు అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం షాంఘై నగరానికి చేరుకున్న ఆయన.. భారత్- చైనా వ్యాపార వేదికనుద్దేశించి ప్రసంగించారు. చైనాను ప్రపంచ కర్మాగారంగా అభివర్ణించిన ఆయన.. భారత్ వనరులకు కేంద్రమన్నారు. భారత్ మీకొక చారిత్రక అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ తరుణంలో పరస్పర సహకారం ద్వారా ఇరుదేశాలూ మరింత అభివృద్ధిని సాధించవచ్చు' అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్- చైనా మధ్య 22 బిలియన్ డాలర్ల విలువైన 21 ఒప్పందాల కుదిరాయి. 'ఇండియా- చైనా బిజినెస్ ఫోరంలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్టిట్టర్ ద్వారా తెలిపారు.