BSF jawan wife
-
ఉద్రిక్తతల నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ కుటుంబం ఆందోళన
రిష్రా(పశ్చిమబెంగాల్): భారత్–పాక్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పరిస్థితులు తన భర్త విడుదల ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సాహు భార్య రజని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అధికారికంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులకు తనకు హామీ ఇచ్చారని, తన భర్త తిరిగి వస్తాడని ఆశించానని తెలిపారు. కానీ, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. తన భర్త కేసును అత్యున్నత స్థాయిలో విచారించేలా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవాలని రజనీ కోరారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో విధు లు నిర్వహిస్తున్న నలభై ఏళ్ల సాహు అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్ సైనికులకు చిక్కాడు. -
అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?
చండీగఢ్: సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్)లో సైనికుల దుస్థితిని వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చిన తన భర్తపై కక్ష సాధిస్తున్నారని తేజ్ బహదూర్ యాదవ్ భార్య షర్మిల వాపోయింది. ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని తనను ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని తనతో యాదవ్ చెప్పాడని ఆమె వెల్లడించారు. బీఎస్ఎఫ్ సైనికులకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ తన భర్త వీడియో ద్వారా ప్రపంచానికి వెల్లడి చేయడాన్ని ఆమె సమర్థించారు. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని తన భర్త సహించడని, అందువల్లే ఉద్యోగంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కొన్నాడని తెలిపారు. తన భర్త మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. ‘ఆయనకు మతిస్థిమితం లేదని, క్రమశిక్షణ పాటించడని అంటున్నారు. అటువంటి ఆయనకు సరిహద్దులో కీలక ప్రాంతాల్లో కాపలా కాయడానికి తుపాకీ ఎందుకు ఇచ్చార’ని షర్మిల ప్రశ్నించారు. కాగా, తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించారు. 4.4 లక్షల మంది షేర్ చేశారు.