breaking news
book unveil
-
ఈవెంట్
తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం ఏర్పాటు ‘ఇంతవరకూ రాసిన చరిత్రలో దొర్లిన తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ కేంద్రంగా కొత్తగా చరిత్రను నిర్మించే’ లక్ష్యంతో అడపా సత్యనారాయణ అధ్యక్షుడిగా, దేమె రాజారెడ్డి గౌరవాధ్యక్షుడిగా ‘తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం’ ఏర్పడింది. స్థానిక, ప్రాంతీయ, ఉపజాతీయ చారిత్రక సంబంధాలపై లోతైన అధ్యయనం చేయడమే గాకుండా, వివిధ జిల్లాల్లో చరిత్ర పరిశోధక కేంద్ర శాఖలను ఏర్పాటుచేసి జిల్లాల వారి చరిత్రను కూడా నిర్మించాలనీ; చారిత్రక, పురావస్తు, నాణేలు, శాసనాలు, రాత ప్రతులు, అపురూప గ్రంథాల సేకరణ, రాష్ట్రస్థాయి ప్రదర్శనశాలను ఏర్పాటుచేయడంతోపాటు, రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిన తాళపత్ర గ్రంథాలు, విలువైన కళాఖండాలను తెలంగాణకు తెప్పించాలనీ కూడా సంఘం తీర్మానించింది. కాలక్రమంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటుచేసుకోవడమే గాకుండా, అర్కయివల్ మెటీరియల్ అంతా ఒక దగ్గరికి చేర్చేందుకు కృషి చేయాలనీ; తెలంగాణ చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలనీ కూడా సంఘం తన లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. ఈ సంఘం తరపున తేనున్న పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకులుగా ఉంటారు. కవిసేన మేనిఫెస్టో- సాహిత్య చర్చ శ్రీత్యాగరాయ గానసభ, భీమన్న సాహిత్య నిధి ఆధ్వర్యంలో- ఏప్రిల్ 21న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో శేషేంద్ర శర్మ ‘కవిసేన మేనిఫెస్టో’ నూతన ముద్రణ ఆవిష్కరణ, చర్చ ఉంటాయి. ననుమాస స్వామి, ముక్తేవి భారతి, కళావేంకట దీక్షితులు, బన్న ఐలయ్య, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, వి.పి.చందన్ రావు పాల్గొంటారు. శివలెంక రాజేశ్వరీదేవి పుస్తకావిష్కరణ నామాడి శ్రీధర్ సంపాదకత్వలో ‘ప్రేమలేఖ’ ప్రచురిస్తున్న శివలెంక రాజేశ్వరీదేవి కవితల, స్మృతుల సంకలనం ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరగనుంది. రావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, అంబటి సురేంద్రరాజు పాల్గొంటారు. మా కథలు- 2015 2015లో ప్రచురించబడిన కథలతో, ‘తెలుగు కథ రచయితల వేదిక’ ఆధ్వర్యంలో, సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కథాసంకలనం తేనున్నట్టు కన్వీనర్ సీహెచ్.శివరామప్రసాద్ తెలియజేస్తున్నారు. కథకులు తమ కథలను మే 10లోగా పంపాలి. చిరునామా: కన్వీనర్, తె.క.ర.వే. స్వగృహ అపార్ట్మెంట్, సి బ్లాక్, జి-2, భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్-72. ఫోన్: 9390085292 బలివాడ కథానికల పోటీ బలివాడ కాంతారావు జయంతి(జూలై 3) సందర్భంగా సహృదయ సాహితి-విశాఖపట్నం వారు భారత్ నిధి ఫౌండేషన్‌తో కలిసి కథానికల పోటీ నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి 10 వేలు. ద్వితీయ 5 వేలు, తృతీయ 3 వేలు. బహుమతుల ప్రదానం జయంతి రోజున ఉంటుంది. సామాజిక ఇతివృత్తంతో ఈ పోటీ కోసమే రాసిన కథల్ని మే 20లోగా పంపాలి. చిరునామా: శేఖరమంత్రి ప్రభాకరరావు, స.సా. కార్యదర్శి, 409, ఆర్ ఆర్ టవర్స్, మహారాణిపేట, విశాఖపట్నం-530002; ఫోన్: 9885874474 దాశరథి ఉపదేశగీత కోసం... నది మాసపత్రికలో రెండేళ్లపాటు ధారావాహికగా వచ్చిన దాశరథి రంగాచార్య భగవద్గీత వచనానువాదం ‘ఉపదేశగీత’ను పుస్తకంగా తేనున్నామనీ, అయితే, 17వ భాగపు (నవంబర్ 2013) సంచిక లభించడం లేదనీ, కావున, ఆ ప్రతి ఉన్నవారు ఎవరైనా అందజేయగలరనీ, వి.జయప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 9550002354 రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు సంస్కృత వేదాన్తంలో ఆళ్వార్ల(తమిళ) ప్రబంధాలలో నిష్ణాతులైన ముగ్గురు పండితులకు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లోని కోడం దామోదర్ ఫంక్షన్ హాలులో ‘రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు’ ప్రదానం చేయనున్నామని ఆహ్వాన సంఘం కార్యదర్శి సముద్రాల శఠగోపాచార్య తెలియజేస్తున్నారు. గ్రహీతలు: నేపాల్ కృష్ణమాచార్య, కె.వి.నర్సింహాచార్య, ఎస్.రమాకాంతాచార్య. పురస్కర్త: చిన్న జీయర్ స్వామి. -
పుస్తకావిష్కరణలు.. పురస్కారాలు
అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో, అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదాత: నారదాసు లక్ష్మణ్‌రావు. గ్రహీత పరిచయం: అన్నవరం దేవేందర్. జనవరి 12న సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌లోని కామ్రేడ్ బి.విజయ్‌కుమార్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సభలో బూర్ల వేంకటేశ్వర్లు, అమ్మంగి వేణుగోపాల్, జూకంటి జగన్నాథం, గాజోజు నాగభూషణం, నిజాం వెంకటేశం, బి.నర్సన్ పాల్గొంటారు. బ్రౌన్ పండిత పురస్కారం 2015 అనువాదంలో కృషికి గుర్తింపుగా ముకుంద రామారావుకు మన్మథ నామ సంవత్సరపు బ్రౌన్ పండిత పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణంలో కృషికి ఈ పురస్కారాన్ని 2007 నుంచి ఇస్తున్నారు. అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి లాంటి అనువాద కవితా సంకలనాల్ని ముకుంద రామారావు వెలువరించారు. సాహితీ మాణిక్యం పురస్కారాలు కవి సీతారం తన తల్లి మాణిక్యం పేరిట ఇస్తున్న ‘సాహితీ మాణిక్యం’ పురస్కారాలకుగానూ 2016 సంవత్సరానికి కవులు శిఖామణి, యాకూబ్ ఎంపికయ్యారు. జనవరి 15న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో పురస్కార ప్రదానసభ జరగనుంది. అవార్డు గ్రహీతల కవిత్వ విశ్లేషణ: కోయి కోటేశ్వరరావు, వంశీకృష్ణ. పువ్వాడ అజయ్ కుమార్, ఖాదర్ మొహియుద్దీన్, మువ్వా శ్రీనివాస్, ప్రసేన్, రవి మారుత్ పాల్గొంటారు. 61 పుస్తకాల ఆవిష్కరణ సౌభాగ్య తన షష్టిపూర్తి సందర్భంగా, తన 61 పుస్తకాలను ఆవిష్కరించ బోతున్నారు. తనికెళ్ళ భరణి ఆధ్వర్యంలో- ఈ సభ, సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ దగ్గరి సన్‌షైన్ హాస్పిటల్‌లోని శాంతా ఆడిటోరియంలో జనవరి 16న సాయంత్రం 6:01కి జరగనుంది. తొలితరం చిత్రకారుడు మార్చాల పుస్తకావిష్కరణ జి.యాదగిరి రాసిన ‘తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు’ పుస్తకావిష్కరణ జనవరి 17న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణాచార్యులు. కారంచేడు బుచ్చిగోపాలం, శ్రీరంగాచార్య, కొడిచెర్ల పాండురంగాచార్యులు, వై.నాగిరెడ్డి, గిరిజా మనోహరబాబు పాల్గొంటారు. కె.వి.రమణారావుకు చాసో స్ఫూర్తి పురస్కారం చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారాన్ని 2016కుగానూ ‘పుట్టిల్లు’ కథాసంకలనం వెలువరించిన కె.వి.రమణారావుకు ప్రదానం చేయనున్నారు. జనవరి 17న సాయంత్రం 5:30కి విజయనగరంలోని హోటల్ మయూరలో జరిగే పురస్కార సభలో కె.శ్రీనివాసరావు, మృదుల గర్గ్, కేతు విశ్వనాథరెడ్డి, కమల్ కుమార్, ఎ.కృష్ణారావు, రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, రామసూరి, జి.ఎస్.చలం, చీకటి దివాకర్ పాల్గొంటారు. అనంతరం, చాగంటి తులసి కూర్చిన ‘నీ ఉత్తరం అందింది’తోపాటు, ఆమె హిందీలోకి అనువదించిన కేతు విశ్వనాథరెడ్డి, మెడికో శ్యామ్ కథల పుస్తకావిష్కరణలు కూడా జరుగుతాయి. ‘ఆవిర్భావానంతర’ సంచిక కోసం... ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలని’ కోరుతూ, ‘ప్రజల పక్షం వహించే కవులు లేరనే అపవాదును తుంచి’వేసే లక్ష్యంతో, కాలనాళిక పేరిట తేబోయే కవితల సంకలనానికి కవులు స్పందించాలని తెలంగాణ రచయితల వేదిక కోరుతోంది. ‘గోలకొండ కవుల సంచిక’ స్ఫూర్తితో తెస్తున్న దీనికి సంపాదకులుగా జయధీర్ తిరుమలరావు, జలజం సత్యనారాయణ వ్యవహరిస్తారు. సంచికను మహబూబ్‌నగర్‌లో జరిగే తెరవే జిల్లా మహాసభల్లో విడుదల చేస్తారు. చిరునామా: కాలనాళిక, 402, ఘరోండా అపార్ట్మెంట్, డి.డి.కాలనీ, హైదరాబాద్-7. ఈమెయిల్: jayadhirtr@gmail.com