breaking news
BLACKBOX
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్బాక్స్(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.బ్లాక్‌బాక్స్‌లో ముందు భాగంలో ఉండే క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ల్యాబ్‌లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్స్, ఫ్లైట్ డాటా రికార్డర్స్ నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.బ్లాక్‌బాక్స్‌తో..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. -
ఎయిరిండియా ఘటన: బ్లాక్‌బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్‌బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్‌క్లూజివ్‌గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్‌కు పంపడంఅమెరికాలోని ఎన్‌టీఎస్‌బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌బాక్స్ ట్విస్ట్! -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
విమానం కూలిన చోటు గుర్తించాం
జకార్తా: ఇండోనేసియాలో 62 మందితో కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది. ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేసియా పౌరులు, ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. బాధిత కుటుంబాలకు భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఇండోనేసియాకు భారత్ తోడుగా నిలుస్తుందన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం గతంలో అమెరికా విమానయాన సంస్థలు వాడిందేనని శ్రీవిజయ ఎయిర్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జెఫర్సన్ ఇర్విన్ జవెనా అన్నారు. 26 ఏళ్ల క్రితం తయారైన ఈ విమానం ఫూర్తి ఫిట్నెస్తో ఉందని తెలిపారు. శనివారం విమానం జకార్తా నుంచి గంట ఆలస్యంగా బయలుదేరడానికి వాతావరణం సరిగా లేకపోవడమే కారణమని వివరించారు. విషాద ఘటనపై ఇండోనేసియా అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బగుస్ పురుహితో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘విమానం నుంచి ఆఖరు సారిగా నమోదైన సిగ్నల్ ఆధారంగా ప్రమాద ప్రాంతాన్ని గుర్తించాము. బ్లాక్‌బాక్స్‌లుగా పిలిచే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ల నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సిగ్నళ్లను నౌకాదళం కనుగొంది. వీటి ఆధారంగా సముద్ర జలాల్లో అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించాం’అని వివరించారు. అతి త్వరలోనే వాటిని వెలికితీసి, ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలుసుకుంటామని మిలటరీ చీఫ్ హదీ టిజాజంతో అన్నారు. ఆదివారం సముద్ర జలాల్లో 75 అడుగుల లోతులో రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలతో కూడిన ప్రధాన విమాన భాగాలను వెలికితీశామన్నారు. శ్రీ విజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి పొంటియానక్ వైపు బయలుదేరింది. నాలుగు నిమిషాలకే కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్‌కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాద ఘటనపై అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్ బాక్స్‌ను ఇండోనేసియా అధికారులు గుర్తించారు. జావా సముద్రంలో బ్లాక్ బాక్స్‌ను కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. -
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు
ఇండోనేసియా : జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేసింది. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం సముద్రం అడుగు నుంచి భాగం నుంచి సంకేతాలు వస్తున్నట్లు అన్వేషణ బృందాలు గుర్తించాయి. బుధవారం విమాన తోక శకలాన్ని అన్వేషణ బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు బృందాలు గర్తించాయి. ఆదే విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.దాంతో బ్లాక్ బాక్స్‌ను వెలికితీసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ బాక్స్‌ను బయటకు తీస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.