breaking news
Bhoomi Shetty
-
'మహాకాళి'గా భూమి శెట్టి.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్‌లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో వెతుకుతున్నారు.ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది.చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్‌లో నిలిచింది. బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by ಭೂMee🐚 (@bhoomi_shettyofficial) -
ఇంట్లోవాళ్లే అలాంటి మాటలన్నారు, ఎవరూ సపోర్ట్ చేయలేదు
సీరియల్ నటి నుంచి హీరోయిన్గా మారింది భూమి శెట్టి. ఈ కన్నడ అందం 'షరతులు వర్తిస్తాయి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మాది కర్ణాటక ప్రాంతం. మా ఇంట్లో ఇంజనీరింగ్ చేస్తానంటే ఒప్పుకోలేదు. నీకు ఇంజనీరింగ్ ఎందుకు? పెళ్లి చేసేస్తాం.. అన్నారు. లేదు, చదువు కొనసాగిస్తానంటే నాతో మాట్లాడటం మానేస్తామని బెదిరించారు. ఆరేళ్లు మాట్లాడలేదు అయినా సరే ఇంజనీరింగ్ చేస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఆరేళ్లపాటు ఇంట్లోవాళ్లు నాతో మాట్లాడలేదు. ఓసారి నాకు సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయం నేను వాట్సాప్ గ్రూపులో పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత నేను కన్నడ బిగ్‌బాస్‌కు వెళ్లాను. నన్నెలాగో మార్చలేమని అర్థమయ్యాక చివరికి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. బాల్యంలో నా కలర్ గురించి చాలా మాటలన్నారు. బ్లాకీ అని, నల్లగా ఉన్నానని కామెంట్లు చేశారు. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా భయమేసేది. ఎన్నో మాటలు పడ్డా నువ్వు ఇంత నల్లగా ఉన్నావ్.. పెద్దయ్యాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ముఖానికి క్రీముల్లాంటివి పూసుకోమని.. తెల్లగా కనిపించాలని చెప్పేవారు. నేను యక్షగానం చేసే ఆర్టిస్టును. యక్షగానం చేసేటప్పుడు నాలుగు లేయర్ల మేకప్ వేస్తారు. పది లేయర్ల డ్రెస్సు వేసుకుంటాం. అంత కష్టపడితే మా ప్రతిభను గుర్తించి పొగిడేవారు కాదు. పైగా ముఖానికి అలా రంగు పూసుకోవడం వల్ల ఇంకా నల్లగా అవుతున్నానని ఎగతాళి చేసేవారు. అలా ఎన్నో మాటలు పడ్డాను. వాటన్నింటికీ అధిగమించాను' అని చెప్పుకొచ్చింది భూమి శెట్టి. చదవండి: ఈ నటికి ఇంటిపేరు లేదు, ఇండస్ట్రీలో అది భరించలేక సినిమాలకు బ్రేక్ -
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)


