breaking news
bhavani devotee
-
రోడ్డు ప్రమాదం: భవానీ భక్తుడు మృతి
-
రోడ్డు ప్రమాదం: భవానీ భక్తుడు మృతి
రాజమండ్రి: మోరంపూడి జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భవానీ భక్తులతో విజయవాడ వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.