మోరంపూడి జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భవానీ భక్తులతో విజయవాడ వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.