breaking news
Bhajarangdal leaders
-
రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌కు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరి తొలిసారి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్ది రోజులుగా ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు గుడిలోకి వెళ్లిన ఈజంటను కొందరు అడ్డుకున్నారు. బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషయంలో ఆలియా-రణ్‌బీర్‌లు గతంలో చేసిన కామెంట్లపై నిరసన వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే.. అంతేకాదు వారిని వారిని ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా చాలా ఏళ్ల కిందట చెప్పిన ఓ క్లిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట రణ్‌బీర్ తాను మటన్, చికెన్‌తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్బీర్లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ సేగ అట్టుకున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా సినిమాతో పాటు బ్రహ్మాస్త్రను బాయ్‌కాట్ చేయాలంటూ నెజిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక దీనిపై ఇటీవల స్పందించిన ఆలియా ‘సినిమాను చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే మానేయండి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్‌పై కూడా ఆలియాను పలువురు టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్ 9న) హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు బ్రహ్మాస్త్రం పేరుతో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
రాంగోపాల్‌వర్మపై డీఎస్పీకి ఫిర్యాదు
రామచంద్రాపురం : సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ హిందువులను అగౌర పరిచేలా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్‌దళ్ నాయకులు డీఎస్పీ కవితకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం భజరంగ్‌దళ్ రాష్ట్ర కో కన్వీనర్ ఎం సుభాష్ చందర్, జిల్లా గోరక్ష ప్రముఖ్ మాణిక్యం, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్ మాట్లాడారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్విట్ చేసిన రాంగోపాల్‌వర్మపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు మనికంఠ, విజయ్ తదితరులు ఉన్నారు.