breaking news
Beauty Awards
-
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
చిన్న హాబీయే, కానీ లక్షలు సంపాదించి పెడుతోంది
పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, ఆటలంటే చాలా ఇష్టపడే అమ్మాయి మాసూమ్ మీనావాలా మెహతా. అనుకోకుండా ఫ్యాషన్‌పై మక్కువ ఏర్పడడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతో కలసి పనిచేస్తూ ఫ్యాషన్ బ్లాగర్, ఎంట్రప్రెన్యూర్గానే గాక ఇండియన్ లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది. తన ఫ్యాషన్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో పదిలక్షలకు పైగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన మాసూమ్ మీనావాలా బాంబే స్కాటిష్ స్కూల్లో చదువుకుంది. స్కూల్లో ఆమెను అందరూ ‘టామ్‌బాయ్’ అని పిలిచేవారు. ఆటల్లో చురుకుగా ఉండే మాసూమ్ స్కూల్ పుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేది. ఇంటర్మీడియట్లో ఉండగా ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దీంతో తను రోజూ ఫ్యాషనబుల్‌గా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టుచేసేది, కానీ∙ఫ్యాషన్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బీకామ్ అయ్యాక, ఆర్ట్స్ కోర్సులో డిప్లామా చేసేందుకు చేరినప్పటికీ.. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో తరువాత బ్రాండ్ మార్కెటింగ్ ఇండియాలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆ తరువాత లండన్‌లోని ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫ్యాషన్ స్టైలింగ్‌లో డిప్లొమా చేసింది. ఈ సమయంలోనే ఫ్యాషన్ ప్రపంచం లో ఎదగాలని నిర్ణయించుకుంది. కోర్సు పూర్తయ్యాక ముంబై తిరిగి వచ్చి 2010లో ‘మిస్ స్టైల్ ఫియస్టా’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రారంభించి సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ఫ్యాషన్ ఇండియా లో దొరకడంలేదు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ను ఇక్కడ పరిచయం చేయాలనుకుని స్టైల్ ఫియస్టాలో ఎక్కువ గా అంతర్జాతీయంగా ట్రెండ్ అవుతోన్న ఫ్యాషన్‌ను పరిచయం చేసేది. దాంతో అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇష్టపడేవారంతా ఫియస్టాను ఫాలో అయ్యేవారు. ఫాలోవర్స్‌తోపాటు ఆమె ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకపక్క మిస్ స్టైల్ ఫియస్టా నడుపుతూనే మరోపక్క అంతర్జాతీయ ఫ్యాషన్, లగ్జరీ, బ్యూటీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లపై డిజిటల్ కంటెంట్‌ను రూపొందించేది. జిమ్మీచూ, యవెస్ సెయింట్ లారియెంట్, డియోర్, హక్కాసన్, గుస్సి, స్టెల్లా మెక్కార్ట్నీ, జో మలోని, ఈస్టీ లాడర్, రా ప్రెసరీ వంటి బ్రాండ్లతో కలసి పనిచేసేది. మాసూమ్ ఫ్యాషన్స్టైల్, పనితీరు నచ్చిన వోగ్, కాస్మోపాలిటన్, సీఎన్ఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అనేకసార్లు ఆమెను అభినందించాయి. సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎన్నో మ్యాగజీన్ల కవర్లపై మాసూమ్ ఫోటో రావడం విశేషం. మోస్ట్ స్టైలిష్ బ్లాగర్‌గా... ఇప్పటిదాకా డిజిటల్ ఎంట్రప్రెన్యూర్, కాస్మోపాలిటన్ ఈ–టెయిలర్ ఆఫ్ ద ఇయర్, హెచ్ఎస్బీసీ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, పల్లాడియం స్పాట్లైట్ ఎథినిక్ బ్లాగర్ ఆఫ్ ది ఇయర్, ఇండియాస్ బెస్ట్ లగ్జరీ ఫ్యాషన్ బ్లాగర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఫర్ సోషల్ సమోసా 30 అండ్ 30, ‘మోస్ట్ స్టైలిష్ బ్లాగర్’ వంటి అనేక అవార్డులను అందుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, అబు జైన్ అండ్ సందీప్ ఖోస్లా, సబ్యసాచి వంటి వారితో కలిసి పనిచేసింది. ‘‘చిన్న హాబీగా ప్రారంభించిన నా ఫ్యాషన్ చాలామంది ఫాలోవర్స్‌కు నచ్చడం... వాళ్లనుంచి పాజిటివ్ కామెంట్లు రావడంతో నన్ను ఎంతో ప్రోత్సహించినట్లు అయింది. ఒక ఆర్టిస్ట్ తన భావోద్వేగాలు, ఆలోచనలను పెయింటింగ్స్ రూపంలో ఎలా వ్యక్తం చేస్తారో.. నేను ఆ విధంగానే ఫ్యాషన్ గురించిన ఐడియాలు, అభిప్రాయాలు, డ్రెస్సింగ్ గురించి చెప్పేదాన్ని. దీంతో నా బ్లాగ్ ఫాలో అయ్యేవారికి మరింత నాణ్యతతో కూడిన కంటెంట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని మాసూమ్ చెప్పింది. -
బ్యూటీ అవార్డులో మెరిసిన తారలు
-
అందం ఓ వరం
అందానికి చిరునామాగా నిలిచిన ఆ ముద్దుగుమ్మ.. పట్టుచీరలో మరింత మెరిసిపోయింది. అందం దేవుడిచ్చిన వరం అంటోన్న ఈ బ్యూటీక్వీన్ ఒకే ఏడాది ఏడు బ్యూటీ అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సంస్కృతి చాటే చీరకట్టు.. మగువల అందాన్ని రెట్టింపు చేస్తుందని చెబుతోంది. సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యూటిఫుల్ బ్రైడ్‌గా కనిపించిన మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: వాంకె శ్రీనివాస్ నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. చదువంతా అక్కడే సాగింది. చిన్నప్పుడు డ్రెస్సింగ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఓసారి మా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. నలుగురిలో స్పెషల్‌గా కనిపించాలంటే మన ఆహార్యం అదిరిపోయేలా ఉండాలనిపించింది. అప్పట్నుంచి మార్కెట్లోకి వచ్చే నయా డిజైన్స్ గురించి వాకబు చేస్తుండేదాన్ని. నచ్చిన కాస్ట్యూమ్‌ను ట్రై చేసేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అందం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. అలా మోడల్‌గా రంగప్రవేశం చేశాను. బ్యూటీ అనేది దేవుడిచ్చిన వరం. అందుకే ఆ అందానికి ప్రాధాన్యం కలిగించేందుకు బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ వచ్చాను. నమ్మకంతో... 2009లో మిస్ నోయిడా కిరీటాన్ని దక్కించుకున్నా. ఏదో రోజు మిస్ ఇండియాగా మెరవగలననే నమ్మకం కలిగింది. తర్వాత సెకండ్ మిస్ దివా కాంటెస్ట్‌లో పాల్గొని ఫస్ట్ రన్నర్‌గా నిలిచాను. అదే జోష్‌లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాను. ఫిలిప్పీన్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ఎకో బ్యూటీ వీడియో అవార్డు కూడా దక్కింది. వీటితో పాటు మిస్ స్టైల్ ఐకాన్, మిస్ పర్ఫెక్ట్ బాడీ, మిస్ టాలెంట్ అవార్డులూ వరించాయి. ఒకే ఏడాది ఏడు అవార్డులు అందుకున్న ఇండియన్ బ్యూటీగా గౌరవం దక్కింది. మా చెల్లి పుట్టింది ఇక్కడే... నా చిన్నతనంలో మా పేరెంట్స్ కొన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా చెల్లి అపూర్వ ఇక్కడే పుట్టింది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడప్పుడూ ఈ బ్యూటిఫుల్ సిటీకి వస్తుండేదాన్ని. ఇక్కడ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. జ్యువెలరీ కొనుగోలు చేస్తాను. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించాలని ఉంది. టాలీవుడ్లో మంచి చాన్స్ దొరికితే తప్పకుండా చేస్తాను. సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. ప్రస్తుతం ఫెమినా కవర్ పేజీపై దృష్టి సారించాను.