breaking news
bangaru Telangana sadhana
-
గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం
అనంతగిరి: తమ ప్రభుత్వ పాలనలో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రూ.90 లక్షలకు పైగా నిధులతో పలు పనులు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి దశల వారీగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. బిల్లులు తప్పకుండా వస్తాయన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వబోతోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోందని అన్నారు. గిరిగేట్‌పల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మద్గుల్ చిట్టంపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా ఉన్న పాఠశాల నూతన భవన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎక్కువ టీచర్లున్న పాఠ«శాలల నుంచి డిప్యూటేషన్ చేస్తామన్నారు. ఇందుకు త్వరలో ఎంఈఓలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనవసరంగా విమర్శించొద్దు: ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ మా సీఎం, మంత్రులను అనవసరంగా విమర్శించడం మానుకోవాలన్నారు. ఆయనది కర్నాటక ప్రాంతమని, తాండూర్‌లో వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఈ ప్రాంతప్రజలు మంచోళ్లు కనుక గెలిపించారన్నారు. ఇకముందు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మాజీమంత్రికి అభివృద్ధి కంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. తాను ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు చేస్తున్నాన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, పీఆర్ డీఈ రాజమోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, డీటీ కృష్ణయ్య, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింలు, ప్రభావతిరెడ్డి, మాణెమ్మ, శమంతాపాండు, అరుణ, లక్ష్మయ్య, ఎంపీటీసీ సాయన్న, నాయకులు, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్, చందర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రాజమల్లయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు ప్రోత్సాహం
శామీర్‌పేట్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని తుర్కపల్లి గ్రామ పరిధిలో ఉన్న పలు పరిశ్రమలను మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వూట్లాడారు. పరిశ్రమలకు అన్నివిధాలా సహాయుసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికోసం చదువుకున్న యువకులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. చిన్నచిన్న పరిశ్రమలకు పెట్టుబడి అందిస్తుందన్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు క్యాపిటల్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. పరిశ్రమల్లో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. మేడ్చల్‌లో ఐ గ్రీన్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండలంలో పలు పరిశ్రమల కోసం గతంలో 1400 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. వాటిలో 800 ఎకరాలు ఐసీఐసీఐ, 200 ఎకరాలు ఐకేపీ నాలెడ్జ్ పార్క్, 400 ఎకరాలు అలెక్జాండ్రియా కంపెనీలకు కేటాయించినట్లు వివరించారు. ఒక్క ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లోనే 700 మంది స్థానికులకు స్థానం కల్పించినట్లు ఐకేపీ యాజవూన్యం పేర్కొంది. తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను మంత్రికి విన్నవించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల మేనేజింగ్ డెరైక్టర్ కం వీసీ జెడ్రంజన్, ఈడీ వెంకట్‌నర్సింహారెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, (సీఓఓ, సీఎఫ్ఓ) ఈడె ప్రసాద్, మేనేజర్ జీవీవీఎస్ ప్రసాద్, ఈఎంహెచ్ మేనేజర్ చంద్రమోహన్ వివిధ పరిశ్రమల సిబ్బంది పాల్గొన్నారు.