breaking news
Badi Ganta
-
ట్యూషన్ ఎవరికి అవసరం? ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?
మూడేళ్లు రావడంతోటే పిల్లల్ని స్కూల్లో వేయడం,ఉద్యోగాల నుంచి వచ్చే వరకూ ట్యూషన్లో ఉండేలా ప్లాన్ చేయడంమన దగ్గర సర్వసాధారణం.ఏ వయసు పిల్లలకైనా ఏ తరగతుల్లో అయినాట్యూషన్ చెప్పించడం ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది.నిజంగా పిల్లలకు ట్యూషన్ అవసరమా? ఏ వయసులో అవసరం? దాని వల్ల జరిగే మంచి ఏమిటి, ప్రతికూలత ఏమిటి... తెలుసుకుందాం.మన దగ్గర ట్యూషన్ చెప్పించడం రెండు ఆలోచనల్లో భాగంగా ఉంటుంది. ఒకటి: పిల్లలు బాగా చదువుకోవాలి రెండు: టైమ్ వేస్ట్ జరగకుండా ట్యూషన్‌కు పంపడం మంచిది.ఈ రెండో విధానానికి తెలివైన పిల్లలు, తెలివితక్కువ పిల్లలు అనే తేడా లేదు. ట్యూషన్‌కు పంపడం వల్ల వారిని క్రమశిక్షణలో పెడుతున్నామనే సంతృప్తి తప్ప. దీనివల్ల తెలివైన పిల్లల వికాసానికి కొంతమేర నష్టం జరగొచ్చు. ఎందుకంటే ఈ పిల్లలు స్వయంగా చదువుకోగలరు. స్వయంగా చదువుకోవడం వల్ల వారికి ఇంకా తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటి పిల్లలను ట్యూషన్‌కు పంపితే భారం టీచరు మీద వేసి తమ తెలివికి విరామం ప్రకటించవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు సాయంత్రాలు ఇంట్లో ఉండకుండా ఏదో ఒక ట్యూషన్‌కు వెళ్లడం మంచిది అనే ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన మీ పిల్లలకు ఏ మేరకు వర్తిస్తుందో గమనించుకోవాలి.అసలు ట్యూషన్ చెప్పించడం ఎవరికి అవసరం?చాలా మంది తల్లిదండ్రులు తమ మూడేళ్ల చిన్నారులను కూడా ట్యూషన్లో చేర్పిస్తున్నారు. ఇది వారికి మేలు చేయక΄ోగా మొత్తం పెరుగుదల, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా పిల్లలకు ఆరేళ్లు వచ్చాక ట్యూషన్ గురించి ఆలోచించవచ్చు. హైస్కూల్ స్థాయి వరకు వీరికి ట్యూషన్ అవసరం కావచ్చు. అయితే అందరికీ ఇది అక్కర్లేదు. మరి ఎవరికి కావాలి?చదువులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు... మేథ్స్, సైన్స్ వంటి సబ్జెక్ట్‌లు స్కూల్లో చెప్పినవి మరింత అర్థం కావాలంటే ట్యూషన్ పెట్టాలి. కొందరు పిల్లలకు చదువు చాలా ఆసక్తిగా ఉంటుంది. వీరు స్కూల్లో చదివిందే కాక ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. ట్యూషన్ పెడితే టీచర్‌ను సందేహాలు అడిగి ఆ సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ కావాలనుకుంటే లేదా పరీక్షల్లో మార్కులు బాగా రావాలనుకుంటే అలాంటి పిల్లలకు ట్యూషన్ కావాలి. కొందరు పిల్లలకు స్వతహాగా తెలివితేటలు ఉన్నా టీచరు సహాయం ఉంటేనే ఆత్మవిశ్వాసంతో చదువుకుంటారు. లేదంటే ఒత్తిడి ఫీలవుతారు. ఇలాంటి వారికి ట్యూషన్ అవసరం.కొందరు పిల్లలు చదువుతున్న స్కూళ్లలో టీచర్లు సరిగా ఉండరు. లేదా ఫలానా సబ్జెక్ట్‌ను సరిగ్గా చెప్పరు. పిల్లలు ఇది గమనించి ఇంట్లో చెబుతారు. అప్పుడు ఆ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా ట్యూషన్ పెట్టించాలి. కొందరు పిల్లలకు తల్లిదండ్రులే ట్యూషన్ చెప్పగలరు. కాని వారికి వివిధ కారణాల వల్ల వీలు ఉండదు. ట్యూషన్ పెట్టించి తాము పైనుండి అజమాయిషీ చేద్దామనుకుంటే అలాంటి సమయంలో ట్యూషన్ పెట్టించాలి. స్కూల్లో ఎన్ని పిరియడ్స్ ఉన్నాయి, వారానికి ఐదు రోజుల బడినా లేదా ఆరు రోజుల బడినా అనేదాన్ని బట్టి కూడా ట్యూషన్ అవసరమా కాదా అనేది నిర్ణయించాలి. స్కూల్లో పిరియడ్లు రోజుకు 8 ఉండి, వారానికి ఆరు రోజులు బడి నడుస్తుంటే అలాంటి పిల్లలకు రోజూ ట్యూషన్ చాలా భారమవుతుంది. వీరికి వారానికి ఒకరోజు ట్యూషన్ చాలు. అదే ఐదు రోజుల బడి ఉంటే వారానికి రెండు రోజులు ట్యూషన్ చాలు. అంతిమంగా పిల్లలు చదువుకోవాలి... బెంబేలు పడకూడదు.ఆన్లైన్ ట్యూషన్లు పెట్టించవచ్చని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. ఇవాళ ఆన్లైన్లో ఇబ్బడి ముబ్బడిగా ట్యూషన్లు ఉన్నాయి. కాని ముఖాముఖి ట్యూషన్లే ఎక్కువ ప్రభావవంతమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఆన్లైన్ ట్యూషన్లను వీలైనంతగా పరిహరించాలి. (Hyderabad: సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్‌కు నగరం చిరునామా)ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?చాలా మధ్యతరగతి ఇళ్లలో ఇరుగు పొరుగున ఎవరైనా ట్యూషన్ చెబుతుంటే వారి దగ్గరకు ట్యూషన్‌కు పంపి చేతులు దులుపుకోవడం అలవాటు. కాని ట్యూషన్‌కు పంపాలంటే ఆ ట్యూషన్ చెప్పేవారి యోగ్యతలు కూడా కచ్చితంగా చూడాలి.వారి విద్యార్హత ఏమిటి? : తాను బోధించే సబ్జెక్టులో మంచి నైపుణ్యం కలిగి ఉందా? విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతోందా? క్లిష్టమైన భావనలను సులభంగా అర్థమయ్యేలా వివరించగలగాలి.బోధనా నైపుణ్యాలు : సహనం ఏ మేరకు ఉంది. చిరాకు పడుతున్నదా? విద్యార్థులు తప్పులు చేసినప్పుడు లేదా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు, ఓపికగా మరియు అర్థమయ్యేలా వారికి వివరించగలుగుతోందా?గుంపును కూచోబెట్టి ‘చదువుకోండ్రా’ అనే టీచర్లు కూడా ఉంటారు. ఈ గుంపులో రకరకాల తరగతుల విద్యార్థులు ఉంటారు. ఇలాంటి ట్యూషన్ వల్ల ఉపయోగం లేదు. మన పిల్లలనే కేంద్రంగా చేసుకుని ట్యూషన్ చెప్పే టీచర్ వద్దకే పంపాలి. -
Badi Ganta స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి?
స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నట్టు అనుకోకూడదు. స్కూల్ బ్యాగ్ విద్యార్థికి నెత్తిన మోసే మూట కాకూడదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ ఆనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్‌కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపడం. హమాలీలుగా పంపడం కాదు. మోసి చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో?స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నారని సంబరపడి పోతుంటారు కొందరు తల్లిదండ్రులు. విద్యార్థి మోసే బ్యాగ్ బరువును బట్టి అతని చదువును అంచనా వేస్తారు మరికొందరు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. పిల్లల వీపున బండ మోయించినట్లు వారి చేత స్కూల్ బ్యాగ్ మోయించడం సబబు కాదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్‌కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపాలి. మీరెప్పుడైనా చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో? ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు చదువు పేరుతో చాలా పని పెడుతుంటారు. కొందరు ఇది పిల్లలకు అవసరం అనుకుంటే మరికొందరు ఈ మాత్రం హడావిడి స్కూల్‌కు అవసరం అనుకుంటారు. అందుకే చాలా స్కూళ్ల లో రెగ్యులర్ సిలబస్‌తోపాటు అసైన్ మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్.. ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్‌కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థుల వెన్ను వంచుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి వయస్సు, ఎత్తుకు తగ్గట్టు ఉండాలని, విద్యార్థి బరువులో 10 శాతం మించకుండా ఉండాలని నిపుణులు చెప్పే మాటలు మాటలుగా ఉండిపోతున్నాయి. అధిక బరువున్న స్కూల్ బ్యాగులు పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పికి దారితీస్తోంది. (పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?)పిల్లల బ్యాగ్ బరువు ఎంత ఉండాలి1–2 తరగతులు: 1.5 నుండి 2 కిలోలు3–5 తరగతులు: 2 నుండి 3 కిలోలు6–8 తరగతులు: 3 నుండి 4 కిలోలు9–10 తరగతులు: 4 నుండి 5 కిలోలుబ్యాగ్ బరువును ఇలా తగ్గిద్దాం..→ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్లు మాత్రమే బ్యాగ్‌లో ఉంచుకునేలా చూడాలి. లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ వంటివి విడివిడిగా ఉంచుకోవడం మంచిది.→ పుస్తకాలను బైండింగ్ చేయించడం కంటే పేపర్‌తో అట్టలు వేయడం ద్వారా బరువు తగ్గుతుంది. → పేరెంట్స్–టీచర్ సమావేశం జరిగినప్పుడు బ్యాగ్ బరువు విషయం స్కూల్ వారితో చర్చించాలి. వారికి తగిన సూచనలు చేయాలి.→ మీ ఇంటికి స్కూల్ దగ్గరగా ఉంటే ఒక పని చేయొచ్చు. పిల్లల్ని ΄÷ద్దున్న తరగతుల పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా చూసి, లంచ్ బ్రేక్ సమయంలో మీరు వెళ్లి మధ్యాహ్నం తరగతుల పుస్తకాలు ఇవ్వొచ్చు. ఉదయం తరగతుల పుస్తకాలు మీరు తీసుకు రావొచ్చు. దీనివల్ల పిల్లలపై బ్యాగ్ భారం తగ్గుతుంది.→ రేపు ఏయే పాఠాలు జరుగుతున్నాయో, ఏయే టీచర్లు సెలవులో ఉన్నారో, ఏ పుస్తకాలు అవసరమో ముందే పిల్లలకు చెప్పేలా ప్రణాళిక రూ రూపొందించమని స్కూల్ యాజమాన్యాన్ని అడగండి. దీనివల్ల అవసరమైన పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. → చాలా పాఠశాలల్లో క్లాస్ వర్క్, హోం వర్క్ అని రెండు వేర్వేరు పుస్తకాలు వాడమని పిల్లలకు సూచిస్తుంటారు. దానికన్నా ఒకే పుస్తకంలో ముందువైపు క్లాస్‌వర్క్, వెనక వైపు హోం వర్క్ రాసేలా చూడమని టీచర్లకు సూచించొచ్చు. → కొన్ని పాఠశాలల్లో రోజువారీ పాఠ్యపుస్తకాలు అక్కడే పెట్టి, హోం వర్క్ పుస్తకాలు మాత్రం ఇంటికి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అది అన్నిచోట్లా అమలుచేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు.నో బ్యాగ్ డే వారానికి ఒకసారి గానీ లేదా నెలలో రెండు రోజులు గానీ పిల్లలకు స్కూల్ బ్యాగ్ నుంచి స్వేచ్ఛ కల్పించడం ‘హ్యాపీనెస్ కర్రికులం’లో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలు కొన్ని ప్రభుత్వాలు చేసినా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. నిజానికి ఇది పిల్లలకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఆలోచన. స్కూల్ బ్యాగ్ లేని రోజు పిల్లలు ఆటలు పాటలు కథలు బొమ్మలు... వీటితో గడిపితే మానసిక వికాసం కలుగుతుంది. బ్యాగ్ మోత తప్పి వెన్నుకు విశ్రాంతి లభిస్తుంది. అయితే టీచర్లు తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచనను అంగీకరించరు. పిల్లలు అనునిత్యం పుస్తకాలు మోస్తూ పుస్తకాల్లో తలలు కూరి ఉంటేనే వాళ్ళు మంచిపిల్లలు అన్నది వారి భావన. -
Parenting Tips : సెక్షన్ పరేషాన్, సిలబస్ టెన్షన్
పిల్లలకు కొత్త యూనిఫామ్, బ్యాగు, పుస్తకాలు కొనిస్తే చాలనుకుంటారు తల్లిదండ్రులు. పాత క్లాస్ నుంచి కొత్త క్లాస్‌కు వచ్చాం. రోజూ స్కూలుకు వెళ్లి కూచోవడమేగా అనుకుంటారు పిల్లలు. కాని ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు వచ్చిన పిల్లలను బడికి సిద్ధం చేయాలి. గత సంవత్సరం వారి చదువులోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఈ క్లాసులో మరింత మెరుగ్గా ఎలా చదవాలో అవగాహన కలిగించాలి. స్కూల్లో, ఇంట్లో వారిని మార్చాలి... తల్లిదండ్రులు మారాలి...ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.పిల్లలు స్కూల్‌కు వెళ్లడం అంటే మరో తరగతిని చదవడమే అని భావిస్తారు. స్కూల్ రీఓపెన్ అయ్యాక పాత తరగతిని ఒదిలి పై తరగతికి వెళ్లడం వీరికి ఉత్సాహంగా ఉంటుంది. మనం కొంచెం ఎదిగాం అనుకుంటారు. గత సంవత్సరం చదివినట్టుగానే ఈ సంవత్సరం చదివేయాలి అని భావిస్తారు. ఇవన్నీ ప్రతి విద్యార్థికీ రొటీన్‌గా అనిపించవచ్చుగాని తరచి చూస్తే తల్లిదండ్రుల ప్రమేయంతో పిల్లలకు సహాయపడాల్సిన అంశాలు చాలా ఉంటాయి.1. సెక్షన్ పరేషాన్చాలా స్కూళ్లలో కొత్త విద్యా సంవత్సరానికి స్టూడెంట్స్‌ను షఫుల్ చేయడం ఉంటుంది. అంటే గత సంవత్సరం చదివిన సెక్షన్ కాకుండా కొత్త సెక్షన్ వేస్తారు. గత క్లాసులోని ఫ్రెండ్స్ ఈ క్లాసులో ఉండొచ్చు... ఉండక పోవచ్చు. దాంతో కొందరు పిల్లలు అప్సెట్ అవుతారు. ఫ్రెండ్స్ ఉన్న సెక్షన్లోకి వెళతామంటారు. ఇందుకు స్కూల్ వారు ఒప్పుకోరు. కొత్త సెక్షన్లో వేయడం వల్ల మొదట కష్టంగా ఉన్నా తర్వాత తర్వాత బాగుంటుందనీ, కొత్త ఫ్రెండ్స్ అవుతారని, ఈ మార్పుకు అలవాటు పడటం ముందు ముందు మంచి చేస్తుందని పిల్లలకు తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. తేలిగ్గా వదిలేయకుండా అలవాటు పడేవరకు రోజు క్లాసు విశేషాలు మాట్లాడుతూ, ‘అరె... ఈ సెక్షనే బాగుందే’ అని ఉత్సాహపరుస్తూ పాత బెంగను మరువనివ్వాలి. కొత్త క్లాసు టీచర్లను కలిసి, సంగతి చెప్పి, పిల్లాడిని వాళ్లు దగ్గర తీసేలా చేయాలి. ఇక తర్వాత చదువు అదే కొనసాగుతుంది.2. సిలబస్ చదివారా?పిల్లలకు ఏడు వరకు చదువు ఒక విధంగా ఎనిమిది నుంచి మరో విధంగా సాగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు కొత్త పుస్తకాలు కొనిస్తారుగాని తెరిచి చూడరు. తల్లిదండ్రులు తప్పనిసరిగా 8, 9, 10... ఏ క్లాసైతే ఆ క్లాస్ టెక్స్›్ట బుక్స్ అన్నీ తిరగేయాలి. ఎంత సిలబస్ ఉంది... చాప్టర్లు ఏమిటి పరిశీలించాలి. గత సంవత్సరం వచ్చిన మార్కులను బట్టి, విద్యార్థితో చర్చించాలి. ఉదాహరణకు విద్యార్థి ఇంగ్లిష్‌లో తప్ప మిగిలిన సబ్జెక్ట్స్‌లో బాగుంటే ఈ సంవత్సరం ఆ సబ్జెక్ట్ సులువుగా ఎలా చదువుకోవచ్చో విద్యార్థికి అవగాహన కలిగించాలి. లేకుంటే విద్యార్థి తనకు ఇంగ్లిష్ ఇబ్బందిగా ఉందని ఈ సంవత్సరం కూడా చెప్పడు. ఫైనల్ ఎగ్జామ్స్ వేళకు ఇది సమస్యై కూచుంటుంది. అందుకే ఇంగ్లిష్‌ను దాటడం ఈ సంవత్సరపు మొదటి గోల్ అని చె΄్పాలి.3. దినచర్య/నిద్ర ఖరారుపిల్లలు ఎంత గారాల పట్టీలైనా వారికి ఒక దినచర్యను ఖరారు చేయడం క్రమశిక్షణను ఇస్తుంది. క్రమశిక్షణ లేకపోతే ఏ పనీ జరగదు. అందువల్ల స్కూల్‌కు వెళ్లడం దగ్గరి నుంచి రాత్రి నిద్ర΄ోవడం వరకూ తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని విద్యార్థి అంగీకారంతో ΄్లాన్ చేయాలి. నిద్ర లేచే సమయం, స్కూల్‌కు ప్రిపేర్ అయ్యే సమయం, తిరిగి వచ్చాక రిలాక్స్ అవడానికి ఆటలకు సమయం, తిరిగి చదవే సమయం, హోమ్‌వర్క్ సమయం... ఇవన్నీ తప్పనిసరిగా నిర్ణయంచాలి. వారంలో ఏ రోజు ఏ సబ్జెక్ట్‌ను చదవాలో కూడా ΄్లాన్ చేయాలి. కష్టమైన సబ్జెక్ట్‌కు ఎక్కువ రోజులు కేటాయించాలి. అలాగే రోజుకు 8 గంటల నిద్ర పిల్లలకు తప్పనిసరి. నిద్రే పిల్లలకు ఆరోగ్యం. ఎనిమిది గంటల నిద్రను ఒదిలి ఇవన్నీ ΄్లాన్ చేయాల్సి ఉంటుంది.4. చదివే చోటును ఏది?కొత్త క్లాసులోకి వచ్చారు సరే... ఇంట్లో రోజూ కూచుని చదువుకునే చోటు ఏది? ఇది విద్యార్థి ఇష్టం ప్రకారం తల్లిదండ్రులు నిశ్చయించాలి. ఇంట్లోని రోజువారీ వ్యవహారాలు వారిని డిస్ట్రబ్ చేయని విధంగా, మంచి గాలి వెలుతురు ప్రశాంతత ఉన్న చోట పిల్లలకు స్టడీ ఏరియా డిసైడ్ చేయాలి. అక్కడ ఏదైనా కొత్త కుర్చీనో, స్టడీ ప్యాడ్నో, టేబుల్‌నో కొనివ్వగలిగితే పిల్లలకు ఉత్సాహం వస్తుంది. మంచి చదువుకునే చోటు చూపకుండా పిల్లల్ని బాగా చదవమనడం సరి కాదు.5. ధ్యాస మళ్లించే విషయాలు ఏవి?కొత్త విద్యా సంవత్సరంలో గత సంవత్సరం టైమ్ వేస్ట్ చేయించిన విషయాలు ఏమిటో తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని మాట్లాడుకోవాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, గేమ్స్, సినిమాలు... ఇవి స్టూడెంట్ను డిస్ట్రాక్ట్ చేస్తే పెళ్లిళ్లు పేరంటాలని చెప్పి స్కూలుకు డుమ్మాలు కొట్టించడం, ఎక్కువ ప్రయాణాలు... ఇవి పెద్దల వల్ల వచ్చే అంతరాయాలు. ఇద్దరూ కంట్రోల్ చేసుకోవాల్సిందే. గత సంవత్సరం అటెండెన్స్ కంటే ఈ సంవత్సరం అటెండెన్స్ ఎక్కువ ఉండేలా కృషి చేయాలని ఇంటి సభ్యులంతా అనుకోవాలి.ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!6. రివ్యూ మీటింగ్తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఉదయం విద్యార్థితో రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి. ఇది దండించడానికో బెదరించ డానికో కాక విద్యార్థిని అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా ముందు నుంచీ తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ఆ వారం జరిగిన క్లాసులు, స్లిప్ టెస్ట్‌లు, మార్కులు, హోమ్‌వర్కులు... అన్నీ బేరీజు వేసుకుని విద్యార్థికి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని సరి చేయడానికి ఈ రివ్యూ మీటింగ్‌లు గట్టిగా ఉపయోగపడతాయి.స్కూల్లో విద్యార్థి చదువుతున్నాడంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువుతున్నట్టే. మా దగ్గర టైమ్ లేదు అంతా స్కూల్‌కే అప్పజెబుదాం అనుకుంటే విద్యార్థి గురించి ఏమీ తెలియకుండా పోతుంది. కొందరు పి.ఎం.ఐలకు కూడా వెళ్లరు. దీని వల్ల టీచర్లు ఇచ్చే సూచనలు మిస్ అవుతారు. కొత్త తరగతిలో మీ అబ్బాయి/అమ్మాయితో కలిసి మీరూ అడుగుపెట్టండి. -
మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్ చేశారా?
స్కూల్ ఫీజ్ ఎంత కడుతున్నారో మీకు తెలుసుగాని ఆ కట్టిన డబ్బులోని ప్రతి పైసాకు సరి పడే విధంగా అక్కడ పాఠాలు చెబుతున్నారా? సౌకర్యాలు ఉన్నాయా? టీచర్లు యోగ్యులేనా? విద్యావిధానంలో వారి తాత్త్వికత ఏమిటి? స్టూడెంట్–టీచర్ మధ్య అనుబంధం ఉందా? ఆటలు ఉన్నాయా? విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నేటి నుంచి అవగాహన కథనాలు... ‘మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నారు’ అని పేరెంట్స్ అనుకున్నంత మాత్రాన అది మంచి స్కూల్ అయిపోదు. ‘ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నారులే’ అన్నంత మాత్రాన అది చెడ్డ స్కూల్ అయిపోదు. చాలా ఎక్కువ ఫీజు ఉన్నది చాలా మంచి స్కూల్ అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. దగ్గరగా ఉందనో, ట్రాన్స్పోర్ట్ ఉందనో, అందరూ అక్కడే చదువుతున్నారనో... రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను ఎంచిన స్కూళ్లలో చేరుస్తుంటారు. చేర్చి, మళ్లీ స్కూల్ వైపే చూడకుండా క్లాసుల మీద క్లాసులు చదివిస్తుంటారు. మన పిల్లలకు వచ్చే మార్కులను బట్టే అది మంచి స్కూల్ అనుకునేవారు కూడా ఉంటారు. అంటే పిల్లలకు నూటికి 90కి పైన వస్తున్నంత కాలం ఆ స్కూల్ ఎలా ఉన్నా వారికి పర్వాలేదు. కాని ఇలాంటి అంచనాలన్నింటితో ఒక స్కూల్‌ని ఎంచడం విద్యార్థికి ఏదో ఒక మేర నష్టం చేయడమే అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: టెంట్ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?ఒక స్కూల్ ఎప్పుడు మంచి స్కూల్ అవుతుంది అనే దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పేపర్లో ఆ స్కూల్ విద్యార్థుల మార్కుల కనిపించడం వల్ల మాత్రమే మంచి స్కూల్ అనుకోక నిజంగా పిల్లలు సరైన స్కూల్లో చేరాలంటే, కొనసాగాలంటే తల్లిదండ్రులు ఆ స్కూల్‌ను ఈ ప్రమాణాల రీత్యా పరిశీలించాల్సి ఉంటుంది.విద్యా తాత్త్వికత ఎలాంటిది?ప్రతి మంచి స్కూల్‌కు ఒక తాత్త్వికత ఉంటుంది. తమ బడిలో చదివిన పిల్లల వికాసం ఏ రీతిన సాగాలో ఆ స్కూల్ ఏర్పాటు సమయంలోనే నిర్వచనం చేసుకుని ఉంటారు. భారతీయతలోని భిన్న సమాజాల పిల్లల కలయికతతో తరగతి ఉండాలనీ, అన్ని భాషల సంప్రదాయాల పిల్లల మధ్య సమ భావనతో తరగతి ఉండాలని, ఏ ఒక్క సమూహపు అహం/ ప్రాధాన్యం పెరగని విధంగా చూడగలరని, విద్యార్థుల మధ్య పోటీతత్త్వం ఎగదోసి ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసే విధానం అవలంబించరని, బోధన ఇంగ్లిష్ మీడియం అయినా ప్రతి మాతృభాషనూ గౌరవించగలిగే స్కూల్‌ను మంచి స్కూల్‌గా ఎంచవచ్చు.బుర్రలా... మరబొమ్మలా?చదువు ఎలా నేర్పిస్తారో చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, పిల్లలు పాఠాలు బట్టీయం వేసి, పరీక్షల్లో ముక్కస్య ముక్కహ రాసి, నూటికి నూరు తెచ్చుకొనేలా తోముతారా లేదా ప్రశ్న మార్చి ఇచ్చినా రాసేలాగా, బుర్ర పెట్టి ఆలోచించగలిగేలాగా, సొంతంగా నేర్చుకునే లాగా, సబ్జెక్ట్స్‌పై ఆసక్తి కలిగేలాగా చెబుతారా? ఈ రెండో విధానం కలిగినది మంచి స్కూల్.చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తోవినూత్నమైన టీచింగ్టీచింగ్ ఎలా ఉంటుందనేది చూడాలి? అదే మూస సంప్రదాయ పద్ధతిలోనేపాఠాలు చెబుతున్నారా? లేదంటే ఆధునికమైన ఉపకరణాలు, సాధనాల సహాయంతో చెబుతున్నారా చూడాలి. ఎప్పటికప్పుడు సిలబస్‌ను వర్తమాన పరిస్థితులను బట్టి మెరుగు పరుచుకుంటూ పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ అవసరమైతే ఎక్స్‌పర్ట్‌లను బయటి నుంచి పిలిపించి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారా లేదా చూడాలి. రెండో రకం స్కూలుకు ప్రాధాన్యం ఇవ్వాలి.టీచర్లు ఉన్నారా?ఒక స్కూల్ మనుగడ ఆ స్కూల్లో పని చేసే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ యాజమాన్యం క్వాలిఫైడ్ టీచర్లను తీసుకుంటున్నారా? వారికి మర్యాదకరమైన జీతాలు ఇస్తున్నారా? టీచర్లు ఆ యాజమాన్యానికి లాయల్‌గా ఉన్నారా? ఐదేళ్ల పాటైనా ఒక్కో టీచర్ ఆ స్కూల్లో పని చేయగలుగుతున్నారా? ఈ సంవత్సరం ఉండి మరో సంవత్సరం మారి΄ోయే టీచర్లు ఉన్న స్కూల్లో పాఠాలు నడవవు. స్కూల్ మీద ప్రేమతో ఉంటూ పాఠాలు చెప్పే తపన కలిగిన టీచర్లు ఉన్న స్కూల్‌ను ఎంచుకోవాలి. అలాగే టీచర్లు మొరటుగా ఉంటూ స్టూడెంట్స్‌తో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఆ స్కూల్ జోలికి పోరాదు. స్ట్రిక్ట్‌గా ఉండటం వేరు స్టూడెంట్స్‌ను అవమానిస్తూ, భయభ్రాంతం చేయడం వేరు.క్రీడలు, కళలుక్రీడలకు, కళలకు స్థానం లేని స్కూల్‌కు ఆమడ దూరం ఉండాలి. ఆటస్థలం లేని స్కూల్ ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్ లెవల్ వరకూ పనికి రాదు. ప్లేగ్రౌండ్ ఉన్నా ఆటలను ప్రోత్సహించక చివరి పీరియడ్ వరకూ పాఠాలతో ఊదరగొట్టే స్కూల్స్‌ను మంచివి అనుకోకూడదు. పిల్లల్లో ఎంతో సృజన ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారికి ధన, కనక, వాహనాలిచ్చినట్టే. విద్యార్థి ఎదుగుదల సమగ్రంగా జరగాలి. పాఠాలతోపాటు ఆట పాటలకు విలువిచ్చే బడికే ఓటు.సామాజిక బాధ్యత నేర్పుతున్నదా?మన పాటికి మనం చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, సుఖంగా బతికే ధోరణిని పెంచేలా వీరి తర్ఫీదు ఉంటుందా లేదంటే ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం గురించి ఎరుక పరిచి, అందులో ఉన్న అంతరాల వల్ల బాధ పడేవారి కోసం, సమాజంలో ఉన్నతి కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత రేపు పెద్దయ్యాక ఉంటుంది అనే చెప్పేలా తర్ఫీదు ఉంటుందా చూడాలి. రెండో రకం తర్ఫీదు మంచిది.భద్రత, పరిశుభ్రతఅన్నింటి కంటే ముఖ్యం భద్రత. పిల్లలు ఉన్న చోట వేయి కళ్లతో ఉండాలి. స్కూల్లో ఆయాలు, సెక్యూరిటీ వాళ్లు సరైన ట్రయినింగ్ ఉన్న వాళ్లేనా? బస్‌ల డ్రైవర్లు లైసెన్స్‌లు ఉన్నవాళ్లేనా? కెమెరాల నిఘా ఉందా? ఔట్ పాస్ నియమాలు ఎలా ఉన్నాయి? టాయిలెట్ల దగ్గర రక్షణ ఉందా? ఇవి చూడాలి. అలాగే స్కూల్లో పరిశుభ్రతపాటిస్తున్నారా? గాలి వెలుతురు ఉండేలా చూస్తున్నారా? మంచి నీరు ఇస్తున్నారా? పిల్లల ఆరోగ్యం హటాత్తుగా పాడైతే వారు వెంటనే తల్లిదండ్రులకు తెలియ చేస్తున్నారా? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వ గలుగుతున్నారా... ఇవన్నీ చూసుకుని, సంతృప్తికరంగా ఉంటే అది మంచి స్కూల్. ప్రతి పైసాకు ప్రతిఫలంస్కూళ్లు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ వసూలు చేసిన ఫీజుకు జవాబుదారీగా స్కూల్‌ను నిర్వహిస్తున్నారా? ప్రతి పైసాకు ప్రతిఫలం ఇస్తున్నంత బాగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారా? పిల్లలు సంతోషంగా స్కూల్‌కు వెళ్లి సంతోషంగా తిరిగి ఇల్లు చేరుతున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నది మంచి స్కూలో కాదో తేల్చుకోండి.