Atlas Cycle Attagaru Petle : ‘అట్లాస్ సైకిల్’ షురూ
‘‘కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ’ చిత్రాల ఫేమ్ కార్తీక్ రాజు హీరోగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమా షురూ అయింది. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘అనగనగా’ మూవీ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి హీరో చైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్‌బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు. అనంతరం రాజా దుస్సా మాట్లాడుతూ– ‘‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో ΄ాటు ఎమోషనల్గానూ ఉంటుంది. 1980లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అన్నారు కార్తీక్ రాజు. ‘‘వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని కాజల్ చౌదరి పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ క్రాంతి మాధవ్ అతిథిగా ΄ాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి, కెమేరా: గంగానమోని శేఖర్, సంగీతం: సురేష్ బొబ్బిలి.