breaking news
Associate
-
Covid-19 ‘హ్రస్వ దృష్టి’ సంక్షోభంలో ప్రపంచం
2020లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. వినియోగదారు అనుకూల ఇంట ర్ఫేస్ జూమ్, ఇదే విధమైన వీడియో–కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫా మ్ల కారణంగా, ఇంటి నుండి పని చేసే కొత్త సంస్కృతి పుట్టింది. లాక్డౌన్ అనిశ్చితి, విద్యా కార్యకలాపాలను కోల్పోతామనే భయంతో చిన్నపిల్లలు, పసిపిల్లలు రోజుకు చాలా గంటలు తమ ఇళ్లలోనే ఉండి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఫలితంగా పిల్లలు హ్రస్వ దృష్టి (మయోపియా, Myopia) బారినపడ్డారు.మొదట్లో చైనా, ఆ తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని నేత్ర వైద్య నిపుణులు 2020 నాటికి, చిన్న పిల్లల్లో ఆందోళన కలిగించే స్థాయి వేగంతో హ్రస్వ దృష్టి వ్యాపిస్తోందని కనుగొన్నారు. దీంతో ప్రమాద హెచ్చరికలు మోగాయి. చైనాలో ఆరేళ్ల వయస్సు పిల్ల లలో మయోపియా వ్యాప్తిలో 400 శాతం పెరుగుదలను గుర్తించారు. ముఖం నుండి 30 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పుస్తకాలను ఉంచుకోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరంతరం చదవడం అనేవి చిన్న పిల్లలలో హ్రస్వ దృష్టి పెరగడానికి ప్రధాన ప్రమాద కారకాలు. చదవడం, రాయడం ప్రభావితం కానప్ప టికీ, ఉపాధ్యాయుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసిన అక్షరాలను, సుదూర వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వదృష్టిగా సాధారణంగా వ్యవహరిస్తుంటారు. 1960లలో పట్టణ, గ్రామీణ జనాభా రెండింటినీ విస్తృతంగా సర్వే చేసిన చీఫ్ డాక్టర్ ఐఎస్ జైన్ ముఖ్య మైన విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ జనాభాలో (2.77 శాతం), పాఠశాల పిల్లల్లో (4.79 శాతం), చండీ గఢ్ పట్టణ జనాభాలో (6.9 శాతం), పీజీఐ వైద్యులలో (33 శాతం) మందిలో హ్రస్వ దృష్టి వ్యాప్తి క్రమంగా పెరగడానికి కంటికి దగ్గరలో పని చేయడం, అధిక అక్ష రాస్యత రేట్లు, ఆదాయ స్థాయులు కారణమని ఆయన అన్నారు. ఇటీవల, ఉత్తర భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పట్టణ పిల్లలలో 21 శాతం మందికి హ్రస్వ దృష్టి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 ఏళ్లలో 4 రెట్లు ఎక్కువ.పెరుగుతున్న హ్రస్వ దృష్టిపై కోవిడ్-19 క్వారంటైన్ ప్రభావం తూర్పు, ఆగ్నేయాసియాలో ముందుగా ఎక్కువగా కనిపించినప్పటికీ, తక్కిన ప్రపంచంలో ఎవరూ దానినుంచి తప్పించుకోలేదు. ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల్లో రోజుకు సగటున ఒక గంట గడిపిన పిల్లలలో 46 శాతం మంది హ్రస్వదృష్టితో ఉన్నారు. నాలుగు గంటలు గడిపిన వారిలో 76 శాతం మంది ఉన్నారు. తక్కువ బహిరంగ కార్యకలాపాలు, మసక గది వెలుతురు, అధిక పని దీనికి కారణం.గత 10 సంవత్సరాలలో, డిజిటల్ పరికరాల వాడకం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక మైన ‘జామా’ జర్నల్‌లో ‘3 లక్షల కంటే ఎక్కువ మంది పాఠశాల పిల్లలు పాల్గొన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధా రంగా, రోజుకు కనీసం నాలుగు గంటల వరకు డిజిటల్ స్క్రీ¯Œ లపై గడిపే వారిలో, ప్రతి గంటకూ హ్రస్వ దృష్టి అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని’ ఓ విశ్లేషణ ప్రచురితమయ్యింది. హ్రస్వదృష్టి బారిన పడిన అన్ని రకాల రోగుల్లో దాదాపు 8 శాతం మంది జీవితంలో తరువాత అంధత్వాన్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది మయో పిక్ రోగులే అవుతారని డాక్టర్ హోల్డెన్, ఆయన సహ చరులు చేసిన అంచనాలు నిజమైతే ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారవచ్చు. కంటి కండరాలను సడలించే అట్రోపిన్ కంటి చుక్కలను ఉపయోగిస్తే అవి చిన్న పిల్లలలో కనుగుడ్డు వ్యాప్తి చెందటాన్ని నిరోధిస్తాయని, అంతే కాకుండా హ్రస్వదృష్టి పెరగడాన్ని కూడా అవి తగ్గిస్తాయని సింగపూర్‌కు చెందిన డాక్టర్ చువా, ఆయన సహచరులు ఇరవై సంవత్సరాల క్రితమే నిరూపించారు. డాక్టర్ రోహిత్ సక్సేనా నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్య యనం ప్రకారం, రెండేళ్ల కాలంలోనే భారతీయ పిల్ల లలో కరిగిపోయే అట్రోపిన్ చుక్కలు (0.01 శాతం) ఉపయోగించినప్పుడు అవి హ్రస్వదృష్టి పెరుగుదలను తగ్గించాయని తేలింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనాలో డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఇది హ్రస్వ దృష్టి బారిన పడ కుండా కాపాడుతుంది. కోవిడ్–19 సమయంలో ప్రతి రోజూ రెండు గంటలు బయట గడపడం అనేది పిల్ల లలో హ్రస్వ దృష్టి వ్యాప్తిని అరికడుతుందని టర్కీకిచెందిన డాక్టర్లు ధ్రువీకరించారు. బహిరంగ కార్యకలా పాలు రోజుకు 2 గంటలు మించి ఉంటే అట్రోపిన్ (బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిరోధకం) మరింత ప్రభావవంతంగా ఉంటుందని చండీగఢ్‌లోని డాక్టర్లు కనుగొన్నారు. అనుభవపూర్వకమైన, సమగ్ర అభ్యాసంపై దృష్టి సారించిన ‘జాతీయ విద్యా విధానం–2020’, పట్టణ భారతదేశంలో స్థల పరిమితుల సాకును చూపి, 2008 విద్యా హక్కు చట్టంలో తప్పనిసరి చేసిన ముఖ్యమైన ఆట స్థలం అవసరాన్ని తొలగించింది. అయితే ఉపా ధ్యాయులు పిల్లలను రోజుకు రెండుసార్లు కనీసం ఒక గంట బయట నడవడానికి అనుమతించాలి.-అమోద్ గుప్తాఎమెరిటస్ ప్రొఫెసర్,పీజీఐఎమ్ఈఆర్, చండీగఢ్ -
ఆప్తమిత్రునికి రూ.588 కోట్లు!.. రతన్ టాటా వీలునామా
రతన్ టాటా పేరు వినగానే.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించే దయాశీలి అని గుర్తొస్తుంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించిన ఈయన (రతన్ టాటా) కన్నుమూసిన తరువాత.. ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది?, వీలునామాలో ఎక్కువ వాటా ఎవరికి కేటాయించారు? అనేవి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిపోయింది.ఇప్పటికి వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కోసం ఎక్కువ మొత్తంలో.. రతన్ టాటా వెచ్చించారని తెలిసింది. అంతే కాకుండా తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద కొంత ఆస్తిని.. జిమ్నీ నావల్ టాటాకు.. జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించినట్లు తెలిసింది.అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఆప్తమిత్రుడు, తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన 77 ఏళ్ల 'మోహిని మోహన్ దత్తా'కు తన మిగిలిన మొత్తం ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు వాటా (సుమారు రూ. 588 కోట్లు) ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యురాలు కాకుండా భారీ మొత్తంలో రతన్ టాటా ఆస్తిని పొందిన ఏకైక వ్యక్తి మోహిని మోహన్ దత్తా.రతన్ టాటాకు చెందిన రూ. 3,900 కోట్ల విలువైన ఎస్టేట్‌ను సుమారు 20 మందికిపైగా పంచగా.. అందులో దత్తా వారసత్వ విలువపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే వీలునామాలో ఉన్న 'నో కాంటెస్ట్' క్లాజ్ కారణంగా.. వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది.ఎవరీ మోహినీ మోహన్ దత్తా?మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపురతన్ టాటా - మోహినీ మోహన్ దత్తా సంబంధంకొన్ని నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా, రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు. రతన్ టాటా టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారని దత్తా స్వయంగా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
డిస్నీ స్టార్‌లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్‌యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
ఐ ఫోన్
దర్శకత్వం: వరప్రసాద్ వరికూటి కథ: ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న వరప్రసాద్ వరికూటి ఈ లఘుచిత్రాన్ని ‘ఇండియన్ మైండ్స్ సినిమా’ బ్యానర్‌పై రూపొందించారు. ఇందులో ఒక సంపన్న యువకుడు పొగరుబోతుగా ప్రవర్తిస్తుంటాడు. పనిచేసే చోట చిన్న చిన్న విషయాలకే అందరిపై చిందులు వేస్తుంటాడు. ఒకరోజు అతడు తన ఐ ఫోన్ పోగొట్టుకుంటాడు. అతడి బాధితుడైన వురో యువకుడికి ఆ ఫోన్ దొరుకుతుంది. ఫోన్ దొరికిన కొద్ది నిమిషాల్లోనే, దానిలోని యాప్స్ సాయంతో అతడు తనను అనవసరంగా వేధించిన పొగరుబోతు యువకుడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. -
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న దొంగలు