breaking news
Ashwini sathar
-
'చేతిరాత పాస్ పోర్టులు ఇక చెల్లవు'
హైదరాబాద్ : చేతిరాత పాస్‌పోర్టులకు ఇంక కాలం చెల్లనుంది. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి చేతిరాతతో ఉన్న పాస్‌పోర్టులు చెల్లవని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తార్ తెలిపారు. 2014లో రికార్డు స్థాయిలో 14 లక్షల పాస్‌పార్టులు జారీ చేసినట్లు ఆమె గురువారమిక్కడ వెల్లడించారు. హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అశ్వినీ సత్తార్ తెలిపారు. చేతిరాత పాస్‌పోర్టులను మిషన్ రీడబుల్ చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే ప్రతి పాస్‌పోర్టులో రెండు పేజీలు ఖాళీగా ఉండాలని, లేకుంటే జంబో పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకోవాలని అశ్వినీ సత్తార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే విశాఖపట్నం పాస్‌పోర్టు ఆఫీస్‌ను రీజనల్ కార్యాలయంగా మార్చుతామన్నారు. -
6న పాస్‌పోర్ట్ మేళా
ఈ నెల 3న వెబ్సైట్లో అపాయింట్మెంట్లు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న(శనివారం) హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ మేళాలు జరగాలని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్‌కుమార్ పరదేశి ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఉన్న అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి, తిరుపతి, విజయవాడ, నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తత్కాల్ దరఖాస్తులు తీసుకోరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ఉండదు. కేవలం సాధారణ, రెన్యూవల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులను మాత్రమే తీసుకుంటారని పాస్‌పోర్ట్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ఎ.శిరీష్ అన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 3న అపాయింట్మెంట్లు www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థులకు, వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.