breaking news
armugam
-
గగన్‌యాన్ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్ట్ పనులు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపడుతున్నారని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. బుధవారం షార్‌లోని స్పేస్ సెంట్రల్ స్కూల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. రాజరాజన్ జాతీయ జెండాను ఎగు రవేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ షార్ లో కోవిడ్ కారణంగా రెం డేళ్లుగా ప్రయోగాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. షార్‌లోని ప్రయోగ వేదికలను గగన్‌యాన్ ప్రాజె క్ట్‌తో పాటు చంద్రయాన్–3 ప్రయోగానికి సంబం ధించి అనేక ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఘన ఇంధన మోటార్లు ఉత్పత్తి, ప్రయోగ పరీక్షలను చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ, కనెక్టివిటీ నినాదంతో ఇస్రో పని చేస్తోందని చెప్పారు. నేడు దేశంలో 850 చానల్స్ చూడగలుగుతున్నామంటే అది ఇస్రో చేస్తున్న ప్రయోగాల వల్లేనన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదుల కదలికలు వంటి వాటిని టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలుగుతున్నామన్నారు. -
షార్ డైరెక్టర్‌గా రాజరాజన్ బాధ్యతల స్వీకరణ
సూళ్లూరుపేట: షార్ నూతన డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎస్.పాండ్యన్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనుండడంతో బాధ్యతలను ఆయనకు అప్పగించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను షార్ డైరెక్టర్‌గా నాలుగు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా షార్‌లోనే ఉంటూ పాండ్యన్‌తో కలిసి అన్ని విభాగాలను సందర్శించి అవగాహన చేసుకున్నారు. ఈ నెల 15న చంద్రయాన్–2 ప్రయోగం నిర్వహించనున్న దృష్ట్యా ఆయన ముందుగానే విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్–2 పనులు జరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన షార్ మాజీ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ చంద్రయాన్–2 ప్రయోగం అయ్యేదాకా ఇక్కడే ఉంటారని షార్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
ఏమో గుర్రం ఎగరావచ్చు!
న్యూఢిల్లీ:'తిన్నవా, పన్నావా, తెల్లరిందా?'.. ఈ రోటిన్ జీవితం ఆయనకు బోర్ కొట్టింది. ఆయనదేమీ మధ్యతరగతి జీవితం కాదు.ఐఐటీ గ్రాడ్యువేట్. ఢిల్లీ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం. చేతినిండా కాసులు. ఎక్కడికెళ్లడానికైనా కారు. పబ్ కెళ్లినా అదే తాగుడు. వారే మిత్రులు. అవే సొల్లు కబుర్లు. జీవితం బోర్..బోర్.. జీవితంలో ఏదో సాధించాలి. ఎవరికైనా ఏమైనా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు. ఏం చేయాలి? సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన మనసునను తొలిచిన ఆలోచనలు 2008 ఒలింపిక్స్ కు భార్ హాకీ జట్టు ఎంపిక కాలేదు. బాధ పడ్డారు. సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని పరిష్కరించాలి. హాకీలో భారత సువర్ణాధ్యయాన్ని తిరిగి రాయాలి. అందుకు చిన్న పిల్లలకు హాకీ నేర్పించాలి. వారిని భావి హాకీ రత్నాలుగా తీర్చిదిద్దాలి. అదే ధ్యేయంతో ఆర్ముగం అనే ఆ యువకుడు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. విలాసాల కులాసాలను పక్కన పెట్టారు. టీవీని చూడటం ద్వారా ఆ ఆట పట్ల తనకు కలిగిన ఆసక్తికి ఆచరణను జోడించారు. 'హాకీ సిటిజన్ గ్రూప్ పేరిట ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. పిల్లలను సమీకరించారు. తాను ఎన్నడూ హాకీ ప్లేయర్ కాదు. హాకీ గురించి ఎంతో చదివారు. పిల్లలకు హాకీ గురించి తాను చదివిందల్లా చెప్పారు. వ్యయప్రాయాలసాలకు వోడ్చి దేశం నలుమూలల నుంచి కోచ్ లను తెప్పించి తన విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయనకు హాకీ ఆడే శిష్యులు ఏర్పడ్డారు. దేశంలోని 24 ప్రభుత్వ పాఠశాలల్లొ ఆయనకు హాకీ టీమ్ లు ఏర్పడ్డాయి. మొత్తం 2,400 మంది శిష్యులు ఆయన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన టీమ్ లు జిల్లా స్థాయి టోర్నమెంటుల్లో రాణిస్తుంటే ఓ ఇద్దరు రాష్ట్ర స్థాయి టీమ్ కు ఎంపికయ్యారు. ఓ ప్రవృత్తిగా చేపట్టిన జీవితంలో ఆయన రెండో ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తాను స్థాపించిన 'హాకీ సిటిజెన్ గ్రూప్'ఎన్జీవో తరుపున సాయం కోసం ఎక్కడికెళ్లినా 'ఎన్జీవో' నా అంటూ తొలుత ఛీత్కరించారు. రానురాను ఆయన అకుంఠిత దీక్షను గమనించిన పాఠశాలలు ముందుకొచ్చి ఆయనకు అండగా నిలిచాయి. హాకీకి పనికొచ్చే స్కూల్ మైదానాలను టీచర్లే పునరుద్ధరించారు. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి ఆయనక అవసరమైన మేరకు విరాళాలు కూడా అందుతున్నాయి. తన లక్ష్య సాధనకు ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు ఎన్నుకున్నారని ప్రశ్నించగా, ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ఎక్కువ. ఆట స్థలాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకో, చదువుకో అంటూ 24 గంటలు రుద్దుతాయి. ఆట స్థలాన్నవి అసలే ఉండవు'అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్ముగం.. జాతీయం జట్టుకు తన విద్యార్థుల ఎంపిక కావాలని, ఆ దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. ఓలింపిక్స్ కు భారత హాకీ జట్టు అర్హత సాధించడం తన కలని ఆయన చెప్పారు.'ఏమో గుర్రంఎగరావచ్చు. ఆయన కల సాకారం కానూ వచ్చు!' ఆర్ముగం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే' hockeybook@gmail.com/website'ను చూడవచ్చు.