షార్‌ డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్‌ బాధ్యతల స్వీకరణ

Arumugam Rajarajan assumes charge as SDSC director  - Sakshi

సూళ్లూరుపేట: షార్‌ నూతన డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్‌ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌.పాండ్యన్‌ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనుండడంతో బాధ్యతలను ఆయనకు అప్పగించారు. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను షార్‌ డైరెక్టర్‌గా నాలుగు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా షార్‌లోనే ఉంటూ పాండ్యన్‌తో కలిసి అన్ని విభాగాలను సందర్శించి అవగాహన చేసుకున్నారు. ఈ నెల 15న చంద్రయాన్‌–2 ప్రయోగం నిర్వహించనున్న దృష్ట్యా ఆయన ముందుగానే విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్‌–2 పనులు జరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన షార్‌ మాజీ డైరెక్టర్‌ ఎస్‌ పాండ్యన్‌ చంద్రయాన్‌–2 ప్రయోగం అయ్యేదాకా ఇక్కడే ఉంటారని షార్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top