breaking news
applause
-
జీఎస్టీ క్రమబద్ధీకరణతో విజయం చేకూరిందా?
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) హేతుబద్ధీకరణపై కొందరిలో ఆందోళనలు నెలకొంటుంటే, ఇంకొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచకుండా ఇటువంటి క్రమబద్ధీకరణకు పూనుకొని ఒకింత ప్రజల మన్ననలు పొందడంపై ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి.గందరగోళం నుంచి స్థిరత్వం వైపు..2017లో ప్రారంభించిన జీఎస్టీలో ప్రాథమికంగా సాంకేతిక లోపాలు, గందరగోళం, రాజకీయ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు చెల్లించే పరిహారంపై తీవ్ర దుమారమే రేగింది. కేంద్రం రాష్ట్రాల పన్ను వాటాను హరిస్తుందనే వాదనలొచ్చాయి. కానీ కాలక్రమేణా జీఎస్టీ వ్యవస్థ బలపడుతూ వారిని కట్టడి చేయగలిగింది. తాజాగా జీఎస్టీ నిర్మాణంపై కీలక సూచికలు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఏటా నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2018లో 1 కోటి(యాక్టివ్ రిజిస్ట్రేషన్స్) నుంచి 2025 నాటికి 1.5 కోట్లకు విస్తరించింది. ఈ-ఇన్వాయిసింగ్, ఈ-వే బిల్లులు, డిజిటల్ రిటర్న్ ఫైలింగ్స్.. వంటి వ్యవస్థల ద్వారా మద్దతు లభించింది.గృహ వినియోగదారులకు ఉపశమనంజీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణతో విస్తృతంగా వినియోగించే వస్తువులు, అవసరమైన సేవలపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తద్వారా గృహాలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగిస్తుంది. గృహ వినియోగ వ్యయ సర్వే అంచనాల ప్రకారం.. టాప్ 30 గృహ వినియోగ వస్తువులపై సాధారణ సగటు జీఎస్టీ రేటు 11% నుంచి 9%కి పడిపోయింది. ముఖ్యంగా పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, సిన్‌గూడ్స్, ప్రీమియం ఉత్పత్తులు ఉపయోగించే వర్గాలకు అధిక జీఎస్టీ రేట్లను విధించింది.ఆదాయ నష్టం..రేట్ల తగ్గింపు ఆదాయ నష్టానికి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే గృహాలు, నిత్యావసరాలపై తక్కువ పన్ను ఉండడంతో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధిక వాల్యూమ్‌లు క్రియేట్ అవుతుండడంతో ద్రవ్యోల్బణం కూడా సానుకూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారీగా వినియోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా రిటైల్ ధరల సూచిక సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయలున్నాయి.అయినా కొందరు..ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయం మెజారిటీ వర్గానికి మేలు చేసేదైనప్పటికీ కొన్నిచోట్ల రిటైలర్లు, దుకాణాదారులు ఇంకా కొత్త రేట్లను వినియోగదారులకు అందించడం లేదు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు జీఎస్టీపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను పటిష్టపరచాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..! -
రియల్ హీరోకు గ్రాండ్ వెల్కమ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ అనంతరం టాలీవుడ్ లో తెలుగు సినిమాల షూటింగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ 'అల్లుడు అదుర్స్' మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లాక్డౌన్ హీరో సోనూసూద్ కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా రియల్ హీరో సోనూసూద్ లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.(ఏసర్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్..) బెల్లకొండ శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నడు హీరో. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన విలక్షణ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కార్మికులతోపాటు, వేలాదిమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. కలియుగ దాన కర్ణుడుగా అడిగినవారికి కాదనకుండా తనవంతుగా సాయం చేయడమే కాదు, నిర్మాణాత్మకంగా, ఒక పథకం ప్రకారం తన కార్యక్రమాలను కొనసాగించడం విశేషంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
రియల్ హీరో సోనూ సూద్
-
ఆయన.. మా మనసు గెలిచారు!!
నేపాలీ పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం లక్షలాది మంది నేపాలీల మనసు దోచుకుందని అక్కడి పత్రికలు శ్లాఘించాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత నేపాలీ పార్లమెంటులో వేరే దేశం నాయకుడు ప్రసంగించారు. నేపాలీతో మొదలుపెట్టి, తర్వాత హిందీలో కొనసాగించిన మోడీ ప్రసంగం అద్భుతంగా సాగిందని ఆ పత్రిక తెలిపింది. నేపాలీల సున్నితత్వాన్ని ఏమాత్రం దెబ్బతిననీయకుండా మోడీ ప్రసంగించారని, కేవలం సాంస్కృతిక అంశాల గురించే కాక రాజకీయాంశాలను కూడా బాగా ప్రస్తావించారని అన్నారు. నేపాల్‌లో మోడీ రెండు రోజుల పర్యటన సోమవారంతో ముగుస్తుంది. బుల్లెట్‌ను వదిలి బ్యాలెట్‌ను ఎంచుకున్నందుకు అభినందనలని మోడీ నేపాలీలకు చెప్పారు. నేపాలీ మావోయిస్టులు 2006లో హింసా మార్గాన్ని వీడి రాజకీయ స్రవంతిలోకి రావడాన్ని ఆయన అలా ప్రస్తావించారు. శాంతికి మారుపేరైన బుద్ధుడు నేపాల్‌లోనే పుట్టాడని మోడీ ప్రస్తావించగానే అక్కడి ఎంపీలందరూ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో పార్లమెంటును మార్మోగించారు. బుద్ధుడి పేరును మోడీ తన ప్రసంగంలో ఐదుసార్లు ప్రస్తావించారని నేపాలీ మీడియా కథనాలు తెలిపాయి.