APNGO Bhavan
-
ఎపి, తెలంగాణ ఉద్యోగుల మధ్య గొడవ
-
విభజనకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేరు: సబ్బం హరి
రాష్ట్ర విభజనకు సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు అనుకూలంగా లేరని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఢిల్లీలో జరగుతున్న రాజకీయ క్రీడకు తెలుగు ప్రజలు బలయ్యారని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబిడ్స్‌లోని ఏపీఎన్జీవో భవన్లో శనివారం జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ మరో సారి పునరాలోచన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐక్యత కోసం ఏపీఎన్జీవోలు చేసే పోరాటంలో అన్ని పార్టీలు సహయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకు హాజరై సమైక్య నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎన్జీవోలు గతంలో చేసిన 66 రోజుల ఉద్యమంతో కేంద్రానికి ముందల కాళ్లకు బంధం వేసిన సంగతిని ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు గుర్తు చేశారు. పదవుల్లో కొనసాగుతున్న కేంద్రమంత్రులు తమ మనస్సులను మార్చుకోవాలని ఆయన వారికి హితవులు పలికారు. టి. బిల్లు వ్యతిరేకించే విషయంలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. -
ఉద్యమం చల్లారిందనుకోవడం అపోహే
ఏపీఎన్జీవోల సంఘం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య ఉద్యమం చల్లారిందని, విభజన అంశాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకోవడం అపోహే. సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కోసం, మరోమారు ఉద్యమ పిలుపు కోసం వారంతా సిద్ధంగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో భవన్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించామని, అయితే ప్రస్తుతం బిల్లుపై చర్చ మూడు దఫాలుగా జరిగే అవకాశం ఉన్నందున ఏదశలో ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాలనే అంశంపై యోచిస్తున్నామని చెప్పారు.తాము నిర్వహించాలనుకున్న అఖిలపక్ష భేటీని 21కి వాయిదా వేసినట్లు తెలిపారు. రాజకీయ పక్షాల సహకారంతో మరో పెద్ద ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ప్రకటించే యోచన ఉందన్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తామని, విభజన వలన ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలిపే ప్రయత్నం చేస్తామన్నారు. 30 రకాల మొండి వ్యాధులకు అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సదుపాయం ఉండే విధంగా హెల్త్ కార్డు నిబంధనలను మార్చాలని కోరామన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు తదితరులున్నారు. -
ఏపీఎన్జీవో భవన్ ముట్టడికి యత్నం
-
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్లు
-
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్ల జేఏసీ, ఉద్రిక్తం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో సమైక్యాంధ్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ల లోని అబిడ్స్ లోని ఏపీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఎలాంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరగడంతో ఏపీఎన్ జీవో భవన్ వద్ద వాతావరణం వేడెక్కింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బ్యానర్ ను తెలంగాణ న్యాయవాదులు చించివేశారు.