breaking news
Anil Kurmachalam
-
త్వరలో సీఎం కేసీఆర్‌తో సినీ ఇండస్ట్రీ సమావేశం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీ త్వరలో సమావేశం కానుంది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం ఈ విషయాన్ని వెల్లడించాడు. శనివారం నాడు ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఇండస్ట్రీ అభివృద్ధిపై సినీపెద్దలు సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఫిలిం స్టూడియో, ఫిలిం సిటీ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉండబోతుందని పేర్కొన్నాడు. చదవండి: స్టార్ కమెడియన్ సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? -
తెలంగాణ బడ్జెట్‌పై ఎన్నారైల హర్షం
లండన్: ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-2019 బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు. లండన్‌లో ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రవాసుల పక్షాన నిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చారిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రూ. 5కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని, ముఖ్యంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందిస్తున్న తీరు వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు అనిల్ కూర్మాచలం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ బడ్జెట్‌ని ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సృజన్ రెడ్డి తదితరులు తెలిపారు.