తెలంగాణ బడ్జెట్‌పై ఎన్నారైల హర్షం | Anil Kurmachalam Praises Telangana Budget For NRIs | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌పై ఎన్నారైల హర్షం

Mar 16 2018 7:44 PM | Updated on Jul 6 2019 12:42 PM

Anil Kurmachalam Praises Telangana Budget For NRIs - Sakshi

లండన్: ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-2019 బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు. లండన్లో ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రవాసుల పక్షాన నిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చారిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు.

గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రూ. 5కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని, ముఖ్యంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందిస్తున్న తీరు వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు అనిల్ కూర్మాచలం. 

నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ బడ్జెట్‌ని ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సృజన్ రెడ్డి తదితరులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement