జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
సాక్షి,పాయకరావుపేట: టీడీపీ మినీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన మిని మహానాడు పాయకరావు పేట నియోజకవర్గంలో జనం లేక వెలవెలబోయింది.గురువారం పాయకరావుపేటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించింది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.అయితే, మినీమహానాడు ప్రారంభమైన అరగంటకే సభకు వచ్చిన శ్రేణులు మధ్యలోనే వెళ్లిపోవడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా.. కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సభను వదిలి వెళుతున్న జనాలకు నచ్చచెప్పి కూర్చేబెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసుల మాటల్ని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు కంగుతిన్నారు.