breaking news
Amjad Ali Khan
-
శాంతి కోసం అమ్జాద్ పాట
న్యూఢిల్లీ: ప్రపంచంలో శాంతి, ఐక్యతకు పిలుపునిస్తూ అమెరికాలో శనివారం జరిగే సంగీత కచేరీలో ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్, అయాన్లు పాల్గొననున్నారు. ‘చాంట్ 4 చేంజ్’ పేరిట వాషింగ్టన్‌లోని లింకన్ మెమొరియల్‌లో జరిగే ఈ వేడుకలో వీరితో పాటు పలు సామాజిక, రాజకీయ, మత నేపథ్యాల వచ్చే కళాకారులు తమ పాటతో శాంతి కోసం గళమెత్తనున్నారు. ‘చాంట్ 4 చేంజ్ అనేది ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు పిలుపునిస్తుంది. అమాన్, అయాన్ ,నేను ఇందులో పాల్గొని శాంతి,సమైక్యతను ప్రతిబింబించే, గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, సూఫీ గురువు అమీర్ ఖుస్రూలతో ముడిపడిన పాటలను ఆలపిస్తాం’ అని అమ్జాద్ చెప్పారు. ముగ్గురు వుయ్ షల్ ఓవర్‌కమ్, వైష్ణవ్ జానాతో, రఘుపతి రాఘవ రాజారాం లాంటి పాటలను, 13 శతాబ్దంలో ఖుస్రూ సృష్టించిన తారానా గాన శైలిని ప్రదర్శించే అవకాశముంది. వీరికి తబలా వాయిద్యకారుడు అభిజిత్ జతకలుస్తారు. -
ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జపాన్ అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు-2016కు ఎంపికయ్యారు. ఆసియా దేశాల సంస్కృతిని తన సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ను ఈ పురస్కారం వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రమణ్యం, చరిత్రకారులు రోమిలా థాపర్, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీ ఖాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.