breaking news
amith garg
-
ఆర్కే బీచ్‌లో సైకిల్థాన్ ప్రారంభించిన సీపీ
విశాఖపట్నం : నగరంలోని ఆర్కే బీచ్‌లో ఏపీరైజింగ్ సైకిల్థాన్ను నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ శనివారం ప్రారంభించారు. కాలుష్యంపై నగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్థాన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ దళం ఆధ్వర్యంలో ఈ సైకిల్థాన్ నిర్వహిస్తున్నారు. -
వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం..
- టార్గెట్ లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులూ - వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా సంస్థల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అంతేకాక, ఇతర ముఖ్య కార్యాలయాల దగ్గరా భద్రతను పెంచారు. ఈ కలకలానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు కొద్ది రోజుల కిందట ఒక ఉత్తరం వచ్చింది. అందులో సీఎంలను టార్గెట్ చేశామనడం, ఎయిర్ పోర్టు, షార్ లను పేల్చేస్తామంటూ తెలుగులో రాసుంది. ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖ వచ్చింది వాస్తవమేనని, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఈ లెటర్ పోస్ట్ అయినట్లు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
పేకాటాడుతూ పట్టుబడ్డ ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్
విశాఖ: విశాఖ జిల్లాలోని గాజువాకలో పేకాట ఆడుతూ ఓ ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ శనివారం పట్టుబడ్డాడు. ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నర్సింగరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఎల్లుండి ఎస్పీ అమిత్ గార్గ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సమాచారం.