breaking news
Airtel digital TV
-
ఎయిర్ టెల్ 5G అంలిమిటెడ్ డేటా...అదిరిపోయి ప్లాన్
-
ఎయిర్టెల్ డీటీహెచ్, ‘డిష్’ విలీనం!
ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్ డీల్ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ముందుగా డిష్ టీవీ తన డీటీహెచ్ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డి్రస్టిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఆధిపత్యం.. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం వచి్చనట్టు అవుతుంది. ఎందుకంటే అప్పుడు 87 శాతం మార్కెట్ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్టెల్ డిజిటల్, డిష్ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సెపె్టంబర్ నాటికి డిష్ టీవీకి 23.94 మిలియన్ చందాదారులు, ఎయిర్టెల్ డిజిటల్‌కు 16.21 మిలియన్ చందాదారులు ఉన్నారు. టాటా స్కై 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్ టీవీకి చెందిన సన్ డైరెక్ట్ సొంతం. టెలికం మార్కెట్ మాదిరే డీటీహెచ్ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్ గ్రూపునకు చెందిన డిష్ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్ డీటీహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ డిజిటల్ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ‘‘విలీనం వల్ల యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు రెండు దేశవ్యాప్త కంపెనీలు, ఒక ప్రాంతీయ కంపెనీయే ఉంటుంది’’ అని ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ డోకానియా తెలిపారు. విలీన కంపెనీ లిస్టింగ్ భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ 2017 డిసెంబర్లో కొనుగోలు చేసింది. ఇందుకు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కూడా చేయనున్నారు. డిష్ టీవీ డీటీహెచ్ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్ డీటీహెచ్ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్ ఇన్ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్ఎస్ మీడియానెట్‌లో 51% వాటా కలిగి ఉంటుంది. ‘‘సెప్టెంబర్ నాటికే ఒప్పంద దశకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా ఆగిపోయింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి’’అని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలను 3 నెలల్లోపు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీం తీర్పు వచి్చన విషయం తెలిసిందే. -
‘ఎయిర్టెల్’ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్
ధర రూ. 4,999 న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గ్రూప్‌లో భాగమైన ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తాజాగా ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్‌ను (ఎస్టీబీ) ప్రవేశపెట్టింది. దీంతో సాధారణ శాటిలైట్ టీవీ చానల్స్‌తో పాటు టీవీలోనే ఆన్లైన్ కంటెంట్ కూడా వీక్షించేందుకు వీలుంటుంది. కొత్త కస్టమర్స్ దీనికోసం రూ.4,999 చెల్లించాల్సి ఉంటుందని భారతీ ఎయిర్టెల్ సీఈవో (డీటీహెచ్) సునీల్ తల్దార్ తెలిపారు. ఎయిర్టెల్ డీటీహెచ్పై ఏడాదిపాటు 500 చానల్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త కస్టమర్లు ఈ ఎస్టీబీని రూ.7,999కి కొనుగోలు చేయొచ్చని ఆయన వివరించారు. టీవీలో ఇంటర్నెట్ సదుపాయం కోసం వినియోగదారులు సాధారణ టీవీ రేటుకి మించి రూ.10,000–15,000 అధికంగా చెల్లించాల్సి వస్తోందని.. అయితే ఆన్లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాల మధ్య సరిహద్దు చెరిగిపోతున్న నేపథ్యంలో ఒకే డివైజ్‌పై రెండింటి ప్రయోజనాలు అందించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీ ఎస్టీబీలో మూవీ అప్లికేషన్ నెట్‌ఫ్లిక్స్ ప్రీలోడెడ్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోలను ఇందులో చూసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇతరత్రా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్టీబీని కొనుగోలు చేసే తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మరింత అధికంగా డేటా కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్నెట్ టీవీ ఎస్టీబీకి కనీసం 4 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండే బ్రాడ్‌బ్యాండ్ లేదా 4జీ హాట్‌స్పాట్ అవసరమవుతుంది.