breaking news
Administrative rules
-
కేంద్ర ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వండి
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నమని ఆరోపించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతోపాటు అమ లుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా మిగతా సరీ్వసులపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పెత్తనం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలంటూ మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్–ఏ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పెత్తనం కొనసాగేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. -
జూన్ 11న ఆప్ మహా ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు. -
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు
నిబంధనల ప్రకారమే నిర్ణయాలు జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ వెల్లడి జిల్లా పరిషత్ : పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల పోస్టింగ్‌లను మార్చామని జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ చెప్పారు. క్యాంపు కార్యాలయం అధికార నివాసమేనని స్పష్టం చేశారు. ‘ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు, బదిలీ’ శీర్షికతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై జెడ్పీ చైర్పర్సన్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు లేఖ అందజేశారు. అందులోని వివరాలు ఆమె మాటల్లోనే.. పరిపాలన వ్యవహారాలలో భాగంగా జెడ్పీ కార్యాలయంలోని జిల్లా పరిషత్ ఫైళ్లు సంబంధిత సెక్షన్ ఇన్చార్జ్, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, డిప్యూటీ సీఈఓ, సీఈఓ పరిశీలించిన తర్వాతే చైర్పర్సన్ ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయానికి వస్తాయి. ఆ తర్వాత నిబంధనలకు లోబడి ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జెడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయం అధికార నివాసమేనని, నాతో మాట్లాడడానికి వచ్చే అధికారులను రిసీవ్ చేసుకోవటం, మాట్లాడటానికి సమయం కల్పించడం సీసీగా ఉన్న ఉద్యోగి విధి. ఉద్యోగ ధర్మంలో భాగంగా ఏ ఉద్యోగి అయిన వారి సెక్షన్‌కు సంబంధించిన ఫైళ్ల వివరణ గూర్చి క్యాంపు కార్యాలయాలనికి వచ్చి వివరణ ఇస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై ఆరు నెలల్లో విచారణ నిర్వహించకపోతే నిబంధనల ప్రకారం షరతులతో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సదరు ఉద్యోగి దరఖాస్తు పెట్టుకున్నందునే ఫైల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. నేను జిల్లా పరిషత్ పదవికి కొత్త. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమైనా.. నిబంధనల ప్రకారం, ఉద్యోగుల భవిష్యత్ మేరకు వ్యవహరిస్తాను అని ఆ లేఖలో పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తనను నియోజకవర్గంలో పని చేయవద్దని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారని పేర్కొంటూ గీసుకొండ ఎంపీడీఓ పారిజాతం బదిలీ చేయాలని కోరారు. పారిజాతం ఇదే నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉంది. దీంతో దుగ్గొండి ఎంపీడీఓగా డిప్యూటేషన్‌పై పోస్టింగ్ ఇచ్చాము. ఆత్మకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాధ్యతలను కేసముద్రం ఎంపీడీఓకు అదనంగా అప్పగించామని వివరించారు.