breaking news
ACC Cement Company
-
అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్‌పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.సవాలు చేస్తాం.."నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్‌లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.అదానీ సిమెంట్ గురించి..అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్‌ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఏసీసీ చేతికి ఏషియన్ కాంక్రీట్స్
న్యూఢిల్లీ: ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌లో మిగిలిన 55 శాతం వాటాను అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ కైవసం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.426 కోట్లు వెచి్చంచింది. అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ అయిన ఏసీసీకి ఇప్పటికే ఏషియన్ కాంక్రీట్స్లో 45 శాతం వాటా ఉంది. ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని నలఘర్ వద్ద 1.3 మిలియన్ టన్నుల ప్లాంటు, అలాగే అనుబంధ కంపెనీ అయిన ఏషియన్ ఫైన్ సిమెంట్స్‌కు పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఉంది. -
నిరుత్సాహకర ఫలితాలు..ఏసీసీ లాభం 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 30 శాతం క్షీణించింది. రూ. 396.3 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 563 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 3 శాతం పుంజుకుని దాదాపు రూ. 4,427 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 4,292 కోట్ల అమ్మకాలు సాధించింది. స్విస్ బిల్డింగ్ మెటీరియల్ దిగ్గజం హోల్సిమ్ గ్రూప్‌నకు అనుబంధ సంస్థ అయిన ఏసీసీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్యూ1లో మొత్తం వ్యయాలు 10 శాతంపైగా పెరిగి రూ. 3,956 కోట్లను దాటాయి. ఈ కాలంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యయాలు పెరిగినట్లు ఏసీసీ ఎండీ, సీఈవో శ్రీధర్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దీంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు. అయితే సామర్థ్య వినియోగం, వ్యయ నియంత్రణలు కొంతమేర ఆదుకున్నట్లు వెల్లడించారు. రానున్న నెలల్లో సిమెంటుకు డిమాండ్ మరింత పుంజుకోనున్నట్లు శ్రీధర్ అంచనా వేశారు. క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు బీఎస్ఈలో 4.5% పతనమై రూ. 2,058 వద్ద ముగిసింది. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
మరో సిమెంట్ కర్మాగారం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రపంచంలో అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు మరో భారీ సిమెంట్ ఉత్పత్తి కర్మాగారం రానుంది. ఇప్పటికే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్ సిమెంట్ ప్లాంటు కాసిపేట మండలం దేవాపూర్‌లో ఉంది. అలాగే ఏసీసీ సిమెంట్ కంపెనీ మంచిర్యాల శివారులో ఉంది. వీటి సరసన మరో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పే యోచనలో ఉంది. ఇందుకోసం అవసరమైన లెసైన్సులను రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి 2012లోనే ఆ కంపెనీ పొందినప్పటికీ.. గత కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కా రు నుంచి ఆశించిన మేరకు ప్రోత్సాహం లభిం చలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు అప్పట్లో బ్రేక్ పడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నూత న పారిశ్రామిక విధానం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. అపారమైన సహజ సంపద ఉన్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి అంతంతే. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మూతపడటంతో ఇక్కడ చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దృష్టి సారిం చారు. ఈ సిమెంట్ కర్మాగారాన్ని నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, తద్వారా ఇక్కడి ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను అందించేందుకు కృషి చేస్తున్నారు. యాపల్‌గూడలో.. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును ఆదిలాబాద్ మండల పరిధిలోని యాపల్‌గూడ శివారులో నెలకొల్పాలనే యోచనలో ఆ కంపెనీ ఉంది. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన సున్నపురాయి (లైమ్‌స్టోన్) నిక్షేపాలు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభిస్తే సుమారు వెయ్యి మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల కేటాయింపు ఫైలు ఇప్పటికే జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. కాగా జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఇప్పటికే సర్వే నిర్వహించారు. రెవెన్యూ, పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాలను గుర్తించిన విషయం విధితమే.


