breaking news
Aari movie
-
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా 'అరి' అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
అనసూయ ‘అరి’పై మైత్రీ మూవీ మేకర్స్ కన్ను!
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’. శ్రీమంతుడు సినిమాతో మొదలైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం.. మూడు హిట్లు, ఆరు సక్సెస్‌లతో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా.. కొత్త కంటెంట్ ఎక్కడ దొరికినా.. మైత్రీ మేకర్స్ దానిని తెలుగు ప్రేక్షకులకు అందజేస్తుంది. తాజాగా మైత్రీ వాళ్ల కన్ను ‘అరి’చిత్రంపై పడిందట. `పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో తాజాగా విడుదలైంది. (చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక) టైటిల్ లోగో ఈవెంట్‌కి మైత్రీ మైత్రీమూవీస్ రవిశంకర్ కూడా హాజరయ్యారు. లోగోతో పాటు కాస్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో ‘అరి’రైట్స్ తీసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నారట. నిర్మాతల్లో ఒకరైన శేషు మైత్రీ నవీన్‌కు మంచి స్నేహితుడు. దీంతో అరి రైట్స్ కచ్చితంగా మైత్రీ మూవీ మేకర్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్ర దర్శకుడు జయశంకర్‌పై కూడా మైత్రీ మూవీస్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనతో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తోందట. మంచి స్క్రిప్ట్ తీసుకొని రమ్మని దర్శకుడికి చెప్పినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘అరి’ తర్వాత జయశంకర్ నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. అన్ని కుదిరితే.. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో జయశంకర్ కొత్త సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.