breaking news
YSR Aarogyasri
-
శభాష్.. అయిలయ్య
కరీంనగర్ జిల్లా: ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినప్పటికీ ఒక మహిళకు సుఖప్రసవం చేసిన కరీంనగర్ జిల్లా వీణవంక 108 సిబ్బందిపై అభినందనలు కురుస్తున్నాయి. తల్లీబిడ్డను క్షేమంగా ఆస్పత్రిలో చేర్చారు. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన చిర్రకుంట మౌనిక (22) తొలిసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆదివారం పురిటి నొప్పులు రావడంతోపాటు.. ప్లేట్లెట్స్ 39 వేలకు పడిపోయినందున హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వీణవంకకు చెందిన 108 అంబులెన్స్‌లో హనుమకొండకు బయల్దేరారు. మార్గమధ్యలో మౌనికకు నొప్పులు తీవ్రమయ్యాయి. బిడ్డ కాళ్లు బయటికి వచ్చినా.. తల ఇరుక్కుపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఈఎంటీ బక్కతట్ల అయిలయ్య చాకచక్యంగా వ్యవహరించి ఆమెకు పురుడు పోశాడు. అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా హనుమకొండలోని జీఎంహెచ్ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలి భర్త వంశీ.. 108 ఉద్యోగి అయిలయ్యతోపాటు పైలట్ శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్
సాక్షి, ఏలూరు: ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి.. ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, రఘురామకృష్ణమ రాజు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద్యం కాగా ఈ ప్రాజెక్టు అమల్లో అనుభవాలు, ఇబ్బందుల్ని బేరీజు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభించడం విశేషం. చదవండి: ఆరోగ్య ధీమా


