breaking news
-
Mumbai: భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహానగరం ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నవీ ముంబైలోని వాషీలోగల రహేజా రెసిడెన్సీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. 10వ అంతస్తులో తెల్లవారుజామున 12.40 గంటలకు ప్రారంభమైన మంటలు 11, 12 అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ)పరిధిలోని అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే వాషి, నెరుల్, ఐరోలి, కోపర్ఖైరేన్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హోస్ లైన్లు వేసి, వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు.‘ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించాం’ అని ఎన్‌ఎంఎంసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు.10వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుండి మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మృతులంతా రహేజా రెసిడెన్సీ నివాసితులేననని జాదవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చాలా సమయం పట్టిందని, ఎవరూ లోపల చిక్కుకోకుండా అగ్నిమాపక బందాలు పర్యవేక్షించాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై వాషి అగ్నిమాపక కేంద్రంతోపాటు ఎన్‌ఎంఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: స్వీట్స్ షాప్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు స్వీట్స్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. సుమారు 45 షాపులపై దాడులు నిర్వహించారు. -
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం: డీజీపీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతో ఉందని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి దృవీకరించారు.ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధిక సాయం, ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 300గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం. ప్రమోద్ ఉద్యోగ విమరణ పొందే వరకు వచ్చే శాలరీని వారి కుటుంబానికి అందిస్తాం.దీంతో పాటు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షలు,పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8లక్షల పరిహారం ఇస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి. కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీస్ శాఖ తరుఫున నివాళులు’ అని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్‌పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. -
‘‘కేసీఆర్‌పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్ై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
‘అడాప్ట్-ఎ-విలేజ్’కి అపూర్వ స్పందన
సాక్షి, హైదరాబాద్: శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-విలేజ్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నారై దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వేల మంది చికిత్స అందుకుంటున్నారు. మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల కంటి శిబిరాలు(Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు ముందుకు వస్తున్నారుశంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న అడాప్ట్-ఎ-విలేజ్ దాతలతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక దాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే నుంచి ఎన్నారైలు ఈ సేవా కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి వీలైనంత మందికి ఉచిత చికిత్స అందించబోతున్నారు. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాలు నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్‌లు, భోజనం, రవాణా సేవలు ఉచితంగా అందజేస్తారు. అక్టోబర్ 30వ తేదీ దాకా 11 రోజులపాటు అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్‌కు చెందిన రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు హాజరయ్యారు. దాతలు ముందుకు రావడంతో పాటు.. స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని బాలరెడ్డి తెలిపారు. -
పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..!?
పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీలో మరోసారి మార్పు చోటుచేసుకోనుందా? మళ్లీ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం(Babar Azam) జట్టు పగ్గాలను చేపట్టనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి పీసీబీ వర్గాలు. ప్రస్తుత వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది.రిజ్వాన్ నాయకత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్నప్పటికి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. వ్యక్తిగత ప్రదర్శనపరంగా కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పీసీబీ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా జియో న్యూస్ ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సెలక్టర్లు కొత్త వన్డే కెప్టెన్ కోసం ముగ్గురిని షార్ట్ లిస్టు చేసిందంట. అందులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ అలీ ఆఘా ఉన్నారు. అయితే వీరిలో బాబర్ ఆజం ముందుంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబర్ గత రెండేళ్లలో రెండు సార్లు పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న బాబర్.. ఆ తర్వాత మళ్లీ 2024 మార్చి జట్టు పగ్గాలను అతడు చేపట్టాడు. అయితే ఆరు నెలల తిరిగకుముందే మరోసారి కెప్టెన్సీని ఆజం వదులుకున్నాడు.ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాక్ కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు ఈ స్టార్ బ్యాటర్ సిద్దమయ్యాడు. బాబర్ ప్రస్తుతం గడ్డు పరిస్థుతులను ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతోంది. అంతేకాకుండా టీ20 జట్టు నుంచి కూడా సెలక్టర్లు అతడిని తప్పించారు. అయితే సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్‌తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్‌లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్‌తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్‌ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
‘నడుములు విరుగుతున్నాయ్!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్‌లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.Normally the Road size will be 98% and the Pothole size would be 2%.In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025