
చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడ నగరం మునిగిపోగా.. సహాయక చర్యల్లో అలసత్వం, అసలు పునరావాస కేంద్రాల ఊసే లేకపోవడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. తిండి, తాగునీరు లేక నాలుగు రోజులైనా వరద నీటిలోనే ఉండిపోయారు. అధికారులు అటువైపు వస్తారేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్ పేటలో ఇవాళ పర్యటించిన జగన్.. బాధితులు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆపై చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


















































