
హైదరాబాద్ హైటెక్స్‌లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2025 నిర్వహిస్తున్నారు. మూడు రోజుల (అక్టోబర్ 10, 11, 12వ తేదీలు) పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు.

నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2025లో.. టీజీ రేరా, ఎస్‌బీఐ హోమ్ లోన్స్, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో కవాసకి బైకులు, టాటా ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.













