కమ్మేసిన పొగమంచు, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | traffic jam due to foggy weather | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు...భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Jan 16 2018 9:14 AM | Updated on Jan 16 2018 9:23 AM

traffic jam due to foggy weather - Sakshi

సాక్షి, విజయనగరం:  విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలైనా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఫలితంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement