మాల్యాను ఇండియాకు ఎపుడు రప్పిస్తారు? | Vijay Mallya arrested in London, likely to be extradited to India | Sakshi
Sakshi News home page

మాల్యాను ఇండియాకు ఎపుడు రప్పిస్తారు?

Apr 18 2017 4:14 PM | Updated on Aug 20 2018 4:44 PM

మాల్యాను  ఇండియాకు ఎపుడు రప్పిస్తారు? - Sakshi

మాల్యాను ఇండియాకు ఎపుడు రప్పిస్తారు?

వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు ఎట్టకేలకు చెక్‌ పడింది

 ముంబై:  వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి  లండన్‌కు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు ఎట్టకేలకు చెక్‌ పడింది.  దీనిపై  సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంతోంది. అయితే మాల్యాను ఇండియాకు రప్పించేందుకు  తీవ్రంగా శ్రమించిన ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సీబీఏ  చివరకు విజయం సాధించాయి. స్కాట్‌లాండ్‌ పోలీసులు లండన్‌ లో మంగళవారం ఉదయం  ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్   కోర్టులో  ప్రొడ్యూస్‌ చేశారు. మాల్యాను త్వరలోనే భారత్‌ కు  తీసుకున్నారని తెలుస్తోంది.  అయితే న్యాయపరంగా ఈ మొత్తం  ప్రక్రియ ముగిసి మాల్యాను ఇండియాకు  రప్పించేందుకు  మరో నెల రోజులుపట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు  మాల్యా అరెస్ట్‌పై కింగ్‌ఫిషర్‌  మాజీ ఉద్యోగి నీతూ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె ఇది మీడియాకు మంచి పరిణామమని  వ్యాఖ్యానించారు. ఇది న్యూస్‌ చానల్స్‌ సాధించిన గొప్ప విజయమని ఆమె వ్యాఖ్యానించారు.  అయితే  మాల్యా  అరెస్ట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది మంచి పరిణామమని భావిస్తున్నారు.  అయితే భారత్‌ రప్పించేందుకు మరో కీలక అడుగు ముందుకు పడిందని అభిప్రాయపడ్డారు.  ఇది ఇతర లోన్‌ డిఫాల్టర్లకు ఒక హెచ్చరిక  లాంటిదని   పేర్కొంటున్నారు.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ పేరిట రూ. 9 వేల కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా పొందిన మాల్యా.. వాటిని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయారు.   ఈ రుణాలను రాబట్టేందుకు  సుమారు 17బ్యాంకులు  ఎస్‌బీఐ  ఆధ్వర్యంలో ఓ కన్సార్టియంగా ఏర్పడ్డాయి.  తమ రుణాలను ఇప్పించాల్సింది సుప్రీంను ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో భాగంగా  భారతదేశంలో  మాల్యాపై   మనీ లాండరింగ్‌ సహా పలు కేసులలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఇటీవల సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్‌లు జారీ చేయగా, మాల్యాను  దేశానికి రప్పించేందుకు  కేంద్ర ప్రభుత్వం గత ఏడాదికాలంగా  తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో  భారత అధికారుల అభ్యర్థనపై ఇటీవల  బ్రిటీష్‌ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. గత నెల భారతదేశం  అభ్యర్థనను మన్నించిన బ్రిటిష్ ప్రభుత్వం  తదుపరి చర్య కోసం జిల్లా జడ్జికి పంపించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement