'సుబ్రహ్మణ్య స్వామి బ్లాక్ మెయిలర్' | V Hanumantha rao takes on Subramanian Swamy | Sakshi
Sakshi News home page

'సుబ్రహ్మణ్య స్వామి బ్లాక్ మెయిలర్'

Nov 20 2015 12:28 PM | Updated on Sep 19 2019 8:28 PM

'సుబ్రహ్మణ్య స్వామి బ్లాక్ మెయిలర్' - Sakshi

'సుబ్రహ్మణ్య స్వామి బ్లాక్ మెయిలర్'

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి బ్లాక్ మెయిలర్, శాడిస్టు అని వీహెచ్ అభివర్ణించారు. డిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని బీజేపీ నేతలు రాహుల్కు బ్రిటీష్ పౌరసత్వం ఉందని.. కమీషన్ ఏజెంట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాలు దాడి చేస్తాయనే స్వామి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను మేథావినంటూ వ్యవహరిస్తున్న స్వామికి ఎప్పుడో ఒకప్పుడు తగిన శాస్తి జరుగుతుందన్నారు. మోదీ, ఆరెస్సెస్ మెప్పు కోసమే సుబ్రహ్మణ్యస్వామి అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణ జరుపుకోవాలన్న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన సవాల్ను స్వీకరించాలని మోదీని వీహెచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement