కోర్టుకు హాజరైన టీనా అంబానీ | Tina Ambani to appear in court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన టీనా అంబానీ

Aug 23 2013 10:26 AM | Updated on Sep 1 2017 10:03 PM

సంచలనాత్మకమైన 2జి టెలికాం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబాని సతీమణి టీనా అంబానీ శుక్రవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు వచ్చారు.

న్యూఢిల్లీ : సంచలనాత్మకమైన 2జి టెలికాం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబాని సతీమణి టీనా అంబానీ శుక్రవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు వచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ నేతృత్వంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఆమె కోర్టుకు హాజరయ్యారు.  జూలై 19న అనిల్, టీనాలకు కోర్టు నుంచి సమన్లు జారీ కాగా, ఈ కేసు విచారణ నిమిత్తం సాక్షిగా అనిల్ అంబాని నిన్న కోర్టుకు హాజరయ్యారు.

అసలు స్వాన్ టెలికం కంపెనీ అనేది ఒకటుందని గానీ, దాని గురించి గానీ తనకు ఏమీ తెలియదని  అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు వచ్చిన విషయం తెలిసిందే. 2008 సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం పొందిన స్వాన్ టెలికం కంపెనీ గురించి తెలుసా అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు ఆయనీ పైవిధంగా సమాధానం ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement