టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య | Teenaged girl gang raped, killed | Sakshi
Sakshi News home page

టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య

Aug 23 2014 12:37 PM | Updated on Apr 8 2019 6:21 PM

టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య - Sakshi

టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య

ఒడిషాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. టీనేజి యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చారు.

ఒడిషాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. టీనేజి యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలిషాయ్ గ్రామంలో ఈ ఘోర సంఘటన జరిగింది. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలలో  కూడా వెల్లడైందని డీఎస్పీ ఆర్సీ సేథి తెలిపారు. తన తండ్రితో కలిసి ఆ యువతి ఇంటికి సమీపంలో ఉన్న పొలానికి వెళ్లింది. తర్వాత తండ్రికి పొలంలో పని ఉండటంతో ఆమె ఒక్కర్తే ఇంటికి బయల్దేరింది.

సాయంత్రం పని అయిపోయాక తండ్రి ఇంటికి తిరిగి వచ్చినా కూతురు మాత్రం ఇంటివద్ద లేదు. దాంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె కోసం గాలించగా.. చేతులు, కాళ్లు కట్టేసి చెట్ల మధ్య పడిపోయి చనిపోయి కనపడింది. ఆమె శరీరం మీద తీవ్ర గాయాలు కనిపించాయి, సమీపంలోనే పెద్ద బండరాళ్లు కూడా ఉన్నాయి. గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత పీక పిసికి చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement