పన్నీరు సెల్వంకే పట్టం | Tamil Nadu Finance Minister Panneerselvam to become next CM | Sakshi
Sakshi News home page

పన్నీరు సెల్వంకే పట్టం

Sep 28 2014 3:32 PM | Updated on Sep 2 2017 2:04 PM

పన్నీరు సెల్వంకే పట్టం

పన్నీరు సెల్వంకే పట్టం

జయలలిత తన అనుంగు అనుచరుడు ఓ. పన్నీరు సెల్వంపై మరోసారి నమ్మకముంచారు.

చెన్నై: జయలలిత తన అనుంగు అనుచరుడు ఓ. పన్నీరు సెల్వంపై మరోసారి నమ్మకముంచారు. ముఖ్యమంత్రిగా ఆయనకు మళ్లీ పట్టం కట్టారు. 'అమ్మ' ఆదేశాల  మేరకు  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి పలువురు పేర్లు వినిపించినా 'విశ్వాసపాత్రుడు'వైపే పురచ్చితలైవి మొగ్గుచూపారు.

గతంలో జైలుకు వెళ్లినప్పుడు కూడా పన్నీరు సెల్వంకే ఆమె ముఖ్యమంత్రి పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. రెండోసారి కూడా ఆయనకే అవకాశం దక్కడం గమనార్హం. పన్నీరు సెల్వం రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement