ఆ ఆధ్యాత్మిక గురువుకు తాలిబన్ బెదిరింపు | Sri Sri Ravi Shankar receives threat allegedly from Tehreek-e-Taliban | Sakshi
Sakshi News home page

ఆ ఆధ్యాత్మిక గురువుకు తాలిబన్ బెదిరింపు

Jul 17 2015 5:27 PM | Updated on Aug 28 2018 7:22 PM

ఆ ఆధ్యాత్మిక గురువుకు తాలిబన్ బెదిరింపు - Sakshi

ఆ ఆధ్యాత్మిక గురువుకు తాలిబన్ బెదిరింపు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఆయనను త్వరలోనే హత్య చేస్తామంటూ తెహ్రిక్ ఈ తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు పంపించినట్లు సమాచారం. దీంతో ఆయన పోలీసు అధికారులకు సమాచారం అందించారు.

గతంలో కూడా రవిశంకర్కు ఇస్లామిక్ స్టేట్, ఇతర తాలిబన్ ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపు ఫోన్లు రాగా.. వాటిపై ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు. అయితే, అవన్నీ, ఫేక్ కాల్స్ అని గుర్తించారు. అలాగని తేలికగా తీసుకోకుండా తాజాగా వచ్చిన బెదిరింపుల విషయంలో మరోసారి పోలీసు అధికారులు బెదరింపులు ఎక్కడ నుంచి వచ్చిన విషయం గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవిశంకర్కు భద్రతను మరింత పెంచాలని ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement