ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
ముంబై: ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించగా, నిఫ్టీ 8150 ఎగువన మొదలైంది. సోమవారం నాటి బలమైన ముగింపును కొనసాగిస్తూ సెన్సెక్స్ 115 పాయింట్లు పెరిగి 26,464 వద్ద నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 8,168 వద్ద ట్రేడవుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలూ గ్రీన్ గానే ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు లాభపడుతున్నాయి. కాగా హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్ టాటా పవర్ టాప్ గెయినర్ గా, ఐటీసీ టాప్ లూజర్ గా ఉంది. జీ, హిందాల్కో లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, ఇండస్‌ఇండ్ బలహీనంగా ఉన్నాయి.
మరోవైపు ఎఫ్‌ఐఐ అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం రూ. 318 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. అటు డాలర్ తో రూపాయి14 పైసల లాభంతో రూ. 68.08 పటిష్టంగా ఉంది.