చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు | Rs 92 lakh spent on mats for Yoga day | Sakshi
Sakshi News home page

చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు

Jul 30 2015 8:13 PM | Updated on Sep 3 2017 6:27 AM

చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు

చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చాపల కొనుగోలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? అక్షరాలా 92 లక్షల రూపాయలు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చాపల కొనుగోలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? అక్షరాలా 92 లక్షల రూపాయలు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు గురువారం తెలిపింది. ఆయుష్ మంత్రిత్వశాఖ మొత్తం 37 వేల యోగా చాపలను కొనుగోలు చేసింది.

మెసర్స్ ఆర్క్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని సరఫరా చేసింది. ఈ మొత్తం చాపలకు రూ. 92.50 లక్షలు (పన్నులు అదనం) ఖర్చయినట్లు ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మొత్తం కార్యక్రమ నిర్వహణకు దాదాపు రూ. 32 కోట్లు ఖర్చయినట్లు ఇంతకుముందు ప్రభుత్వం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement