ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ | Renuka Chowdary Go Back slogans at AP Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ

Feb 8 2014 12:59 PM | Updated on Mar 28 2019 5:23 PM

ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ - Sakshi

ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ

ఏపీ భవన్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేణుకా చౌదరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

న్యూఢిల్లీ : ఏపీభవన్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీమాంధ్రలో భద్రాచలం ముంపు గ్రామాలను కలవ వద్దంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ శనివారం ఏపీభవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. అయితే ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరిని ఆహ్వానించడంపై జేఏసీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. రేణుకా గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తింది. దాంతో ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

కాగా విద్యార్థి జేఏసీ ధర్నాకు రౌణుకా చౌదరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవటం తమ  లక్ష్యమన్నారు. రామాలయ ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.  విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని రేణుక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement