పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రావెల కౌంటర్ | ravela kishore babu takes on pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రావెల కౌంటర్

Aug 23 2015 5:22 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రావెల కౌంటర్ - Sakshi

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రావెల కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములను బలవంతంగా లాక్కుంటే ధర్నా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములను బలవంతంగా లాక్కుంటే ధర్నా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. రాజధాని భూముల విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి..పవన్ కల్యాణ్ను తప్పుపట్టారు.

రాజధాని ప్రాంతంలో భూసేకరణకు అవసరమైతే రైతులకు నచ్చజెప్పి ఒప్పించాలని పవన్కు సూచించారు. భూములు ఇవ్వకుండా పవన్ అడ్డుకోవడం సరికాదని రావెల అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రావెల హెచ్చరించారు.ఈ రోజు రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మంత్రులపై విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement