51 ఏళ్ల మహిళపై రేప్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు | rape case, Congress MLA Vincent arrested | Sakshi
Sakshi News home page

51 ఏళ్ల మహిళపై రేప్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు

Jul 22 2017 5:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

51 ఏళ్ల మహిళపై రేప్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు - Sakshi

51 ఏళ్ల మహిళపై రేప్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు

51 ఏళ్ల మహిళను రేప్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు శనివారం అరెస్టు చేశారు..

తిరువనంతపురం: 51 ఏళ్ల మహిళను రేప్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఎం విన్సెంట్‌ను కేరళ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో విన్సెంట్‌ను శనివారం ఐదుగంటలపాటు ప్రశ్నించిన పోలీసులు.. విచారణ ముగిసిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 51 ఏళ్ల మహిళను వెంటాడి అత్యాచారం చేసి.. ఆత్మహత్యకు పూరిగొల్పినట్టు ఇప్పటికే అదనపు అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు ఈ వివరాలను శుక్రవారం కోర్టుకు సమర్పించారు. అంతేకాకుండా ఈ కేసులో పలువురు సాక్ష్యుల వాంగ్మూలం సేకరించారు. ఇందులో బాధితురాలి భర్త, సోదరుడు, ఇరుగుపొరుగువారితోపాటు బంధువులు ఉన్నారు. కొల్లం సిటీ పోలీసు కమిషనర్‌ అజితా బేగం నేతృత్వంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ కేసులో విన్సెంట్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉండటంతో ఆయనకు అండగా నిలిచేవిషయంలో కాంగ్రెస్‌ కూడా వెనుకకు తగ్గుతోంది. బాధిత మహిళ, ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ పోలీసులకు లభించడం.. అందులో ఎమ్మెల్యే విన్సెంట్‌పై మహిళ తీవ్ర అభియోగాలు చేయడంతో కేసులో కీలక సాక్ష్యంగా మారింది. ఇటీవల బాధిత మహిళ బలరాంపూర్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement