బీజేపీ అదే జోరు.. కాంగ్రెస్‌కు భంగపాటు | Rajasthan local body bypoll election results: BJP wins 10 out of 14 seats | Sakshi
Sakshi News home page

బీజేపీ అదే జోరు.. కాంగ్రెస్‌కు భంగపాటు

Mar 30 2017 11:26 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ అదే జోరు.. కాంగ్రెస్‌కు భంగపాటు - Sakshi

బీజేపీ అదే జోరు.. కాంగ్రెస్‌కు భంగపాటు

రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయం సాధించింది.

జైపూర్: ఇటీవల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ అదే జోరు కొనసాగిస్తోంది. రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయం సాధించింది. ఇక్కడా కాంగ్రెస్‌ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఆ రాష్ట్రంలో మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరగగా, 10 సీట్లు బీజేపీ ఖాతాలో చేరాయి. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో గెలిచింది.

వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, మున్సిపల్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఓ జిల్లా పరిషత్ సీటు, 5 పంచాయతీ సమితి, 4 కౌన్సిలర్ సీట్లను సొంతం చేసుకుంది. టంక్ జిల్లాలో బీజేపీ 4640 ఓట్ల మెజారిటీతో జిల్లా పరిషత్‌ సీటును గెల్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement