ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛను పథకం-1995 (ఈపీఎస్) కింద రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పింఛను మొత్తాన్ని నెలకు కనీసం రూ.3 వేలుగా నిర్ణయించాలని పిటిషన్లపై పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛను పథకం-1995 (ఈపీఎస్) కింద రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పింఛను మొత్తాన్ని నెలకు కనీసం రూ.3 వేలుగా నిర్ణయించాలని పిటిషన్లపై పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. దిగువ స్థాయి, మధ్య స్థాయి వేతనాలతో ఉద్యోగ విరమణ చేసేవారి కుటుంబాలకు ఈపీఎస్ ఒక్కటే ఆధారమని, పెరుగుతున్న ధరల దృష్ట్యా పింఛను కనీస మొత్తాన్ని నెలకు రూ.3 వేలకు పెంచాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మంగళవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈపీఎస్ పథకం కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల మూలవేతనంలో 1.16 శాతం మాత్రమే చెల్లిస్తుండగా, ఈ మొత్తాన్ని 8.33 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది.