monthly pension
-
EPFO: రూ.7500లకు గనక పెంచితే..
ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోని పెన్షనర్లు గత పదేళ్లుగా దీని కోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు రూ. 1,000 గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500 కు పెంచాలని ఈపీఎస్-95 (EPS-95) సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఆర్థిక మంత్రితో భేటీ.. ఆశలకు చిగురు!రాబోయే బడ్జెట్ కంటే ముందే EPS-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచడంతో పాటు, దానికి కరువు భత్యాన్ని (DA) కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో, లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచుతారా? లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు.ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయి?ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్‌ను ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = (పెన్షన్ వర్తించే వేతనం X పెన్షన్ వర్తించే సర్వీస్ కాలం) / 70ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని రూ. 15,000 గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కేస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 7,500 కు పెంచితే, వివిధ సర్వీస్ కాలపరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు..సర్వీస్ ఆధారంగా పెన్షన్ అంచనాసర్వీస్ కాలంప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది10 ఏళ్లురూ. 2,142రూ. 7,50020 ఏళ్లురూ. 4,285రూ. 7,50025 ఏళ్లురూ. 5,357రూ. 7,500ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే, పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతుంది.ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే..ఉద్యోగి జీతం (బేసిక్ + డీఏ)లో 12 శాతం పీఎఫ్‌కి వెళ్తుంది. అదే యజమాన్యం చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు వెళ్తుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16 శాతం బడ్జెట్ మద్దతును ఈ పెన్షన్ ఫండ్‌కు అందిస్తుంది.పెన్షన్ పొందడానికి అర్హతలు🔸కచ్చితంగా ఈపీఎఫ్‌వో సభ్యుడై ఉండాలి.🔸కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.🔸58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. (50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది).ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక రూ. 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది.ఇదీ చదవండి: హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్ -
పెన్షనర్లకు బంపర్ బొనాంజ
న్యూఢిల్లీ : పెన్షనర్లకు బంపర్ బొనాంజ దక్కబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ అందించే చెల్లింపులను ప్రభుత్వం రెట్టింపు చేయబోతోందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో సుమారు 40 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే, ప్రభుత్వంపై వార్షికంగా రూ.3000 కోట్ల భారం పడనుంది. ఈపీఎస్ కింద కనీస నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వాలని 2014లో కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం దీని రెండింతలు చేస్తుండటంతో, ఇక నుంచి కనీసం రెండు వేల రూపాయలను పెన్షనర్లు అందుకోబోతున్నారు. ఈపీఎస్ పెన్షన్ రెండింతలు చేస్తున్న నేపథ్యంలో దీని ఖర్చును, లబ్దిదారుల సంఖ్యను లెక్కించాలని ఈపీఎఫ్ఓను కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు సీనియర్ అధికారి చెప్పారు. ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈ పెన్షన్‌ను రెండింతలు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించనుందని తెలిపారు. ఈపీఎస్-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో నెలవారీ రూ.1500 కంటే తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు 40 లక్షల కంటే తక్కువే. వీరిలో కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకునేది 18 లక్షలు మంది. కనీస నెలవారీ చెల్లింపులను రూ.3000-రూ.7500కు పెంచాలని ఎంతో కాలంగా ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ఈపీఎస్-95 పెన్షనర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్లమెంటరీ ప్యానల్ కూడా ఈపీఎస్-95 అసెసీలకు అందించే నెలవారీ కనీస పెన్షన్ రూ.1000ను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిత్యావసరాలు తీర్చేలా సామాజిక భద్రత ప్రయోజనాలుండాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్ కింద సభ్యులైన ఎంప్లాయీస్ ఆటోమేటిక్‌గా ఈపీఎస్ స్కీమ్ కింద ఎన్రోల్ అవుతారు. -
స్వాతంత్ర్య సమరయోధుల పింఛను రూ.7వేలు!
స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛనును ఇప్పుడున్న రూ.5వేల నుంచి రూ. 7వేలకు పెంచుతున్నట్లు పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ పెరిగిన పింఛను వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమలులోకి వస్తుంది. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, మరికొందరు కేంద్ర మంత్రులను కలిసిన రంగసామి.. ఆదివారమే పుదుచ్చేరికి తిరిగి వచ్చారు. అసెంబ్లీ భవనం కొత్త ప్రాంగణానికి శంకుస్థాపన చేసేందుకు రావాల్సిందిగా తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించానని, అందుకు ఆయన అంగీకరించారని రంగసామి చెప్పారు. -
కనీస పింఛన్‌ను రూ.3 వేలు చేయాలి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛను పథకం-1995 (ఈపీఎస్) కింద రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పింఛను మొత్తాన్ని నెలకు కనీసం రూ.3 వేలుగా నిర్ణయించాలని పిటిషన్లపై పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. దిగువ స్థాయి, మధ్య స్థాయి వేతనాలతో ఉద్యోగ విరమణ చేసేవారి కుటుంబాలకు ఈపీఎస్ ఒక్కటే ఆధారమని, పెరుగుతున్న ధరల దృష్ట్యా పింఛను కనీస మొత్తాన్ని నెలకు రూ.3 వేలకు పెంచాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మంగళవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈపీఎస్ పథకం కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల మూలవేతనంలో 1.16 శాతం మాత్రమే చెల్లిస్తుండగా, ఈ మొత్తాన్ని 8.33 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది.


